IPL 2023: సీఎస్కేకు షాకిచ్చిన బెన్ స్టోక్స్.. కోచ్ మైక్ హస్సీ కీలక ప్రకటన!
CSK Coach Mike Hussey says Ben Stokes won`t be bowling in IPL 2023. మొదటి మ్యాచ్‌కు ముందే చెన్నై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెన్ స్టోక్స్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడట.
CSK Coach Mike Hussey says Ben Stokes won't be bowling in IPL 2023: క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేస్తుంది. ఐపీఎల్ 2023 మార్చి 31న ఆరంభం కానుంది. అహ్మాదాబాద్ వేదికగా జరిగే లీగ్ తొలి మ్యాచులో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అయితే మొదటి మ్యాచ్‌కు ముందే చెన్నై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడట.
గత కొంతకాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్న బెన్ స్టోక్స్.. ఐపీఎల్ 2023లో కేవలం బ్యాటర్‌గానే ప్రారంభిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపాడు. లీగ్ సెకండాఫ్ సమయానికి స్టోక్స్ పూర్తిగా కోలుకుంటే.. బౌలర్‌గా సేవలందిస్తాడని హస్సీ స్పష్టం చేశాడు. దాంతో స్టోక్స్ ఆల్‌రౌండర్ సేవలను ఉపయోగించుకుందామనుకున్న చెన్నై జట్టుకి షాక్ తగిలింది. వాస్తవానికి 2023 సీజన్ మొత్తాని స్టోక్స్ అందుబాటులో ఉండడని ప్రచారం జరిగింది. అయితే స్టోక్స్‌కు ఇంజెక్షన్లు ఇచ్చి ఐపీఎల్‌కు రెడీ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
బెన్ స్టోక్స్‌కు చెన్నై జట్టు రికార్డు స్థాయిలో రూ. 16.25 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు స్టోక్స్ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కావడంతో.. బౌలింగ్ వీక్ అయ్యే అవకాశం ఉంది. స్టోక్స్ గాయం సీఎస్‌కే విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే స్టోక్స్ గత సీజన్లలోనూ కూడా పూర్తిగా ఆడలేదు. 2017 సీజన్‌లో అరంగేట్రం చేసిన స్టోక్స్.. ఆ ఏడాది 12 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో 13 మ్యాచ్‌లు, 2019లో 10 మ్యాచ్‌లు, 2020లో 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక 2021, 2022 సీజన్లలోనూ పూర్తిగా ఆడలేదు. ఇప్పుడు కూడా గాయం కారణంగా సీజన్‌కు దూరం కాకూడదనే.. కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతున్నాడు.
Also Read: Hero New Splendor 2023: హీరో సరికొత్త స్ల్పెండర్.. ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది! ధర కేవలం 83 వేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.