IPL 2023 Final: మరి కాస్సేపట్లో గుజరాత్ వర్సెస్ చెన్నై తుదిపోరు, రెండు జట్ల బలాబలాలేంటి
IPL 2023 Final: ఐపీఎల్ 2023 తుది సమరం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. వరుసగా రెండవసారి టైటిల్ సాధించేందుకు గుజరాత్ టైటాన్స్, ఐదవ టైటిల్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు సర్వ శక్తులూ ఒడ్డనున్నాయి. గుజరాత్ అహ్మాదాబాద్ వేదికగా ఐపీఎల్ 2023 తుదిపోరు జరగనుంది.
IPL 2023 Final: దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికుల్ని అలరిస్తూ వచ్చిన ఐపీఎల్ 2023 వేడుక ఇవాళ్టితో ముగియనుంది. గుజరాత్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఇవాళ తుదిపోరుకు చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023 ఫైనల్‌లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి 10 మ్యాచ్‌లలో విజయంతో 20 పాయింట్లు సాధించింది. టాప్‌లో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో పరాజయం పొందినా, రెండవ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబైపై భారీ విజయంతో ఫైనల్స్‌కు చేరింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ పటిష్టంగా ఉంది. శుభమన్ గిల్ ఫామ్ చూస్తుంటే ప్రత్యర్ధులకు గుండె జారిపోతుంది. టోర్నీలో వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. శుభమన్ గిల్‌కు తోడుగా వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా బలంగా ఉన్నారు. మరోవైపు రషీద్ ఖాన్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ ప్రతిభ కనబరుస్తున్నాడు. మొహమ్మద్ షమీ బౌలింగ్ అయితే అత్యంత పగడ్బందీ లైనప్‌తో ప్రత్యర్ధుల్ని ఇరుకున పెడుతోంది. బౌలింగ్‌లో ఈ ఇద్దరికీ తోడుగా మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.
ఇక చెన్నై విషయానికొస్తే బ్యాటింగ్‌లో ఓపెనర్లపై ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మంచి ఓపెనింగ్ ఇస్తున్నారు. ఆ తరువాత బరిలో దిగే అజింక్యా రహానే, శివమ్ దూబే, జడేజా కూడా అద్భుతంగా రాణిస్తుండటం సీఎస్కేకు బలంగా ఉంది. వీరికి తోడు ఎంఎస్ ధోని, మొయిన్ అలీ వంటి హిట్టర్లు కూడా అందుబాటులో ఉన్నా నిలకడగా రాణించలేకపోవడం గమనార్హం. ఇక బౌలింగ్ విషయంలో జడేజా, తీక్షణ, మొయిన్ అలీలపై ఎక్కువ ఆశలున్నాయి. దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతిరాణలు ఎప్పుడు రాణిస్తారో ఎప్పుడు విఫలమౌతారో వారికే తెలియనట్టుంటుంది.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ రెండు సార్లు తలపడగా చెరో విజయాన్ని అందుకున్నాయి. ఎంఎస్ ధోనీకు ఇదే చివరి ఐపీఎల్ టోర్నీ అనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఐదవ టైటిల్ కోసం ధోనీ తీవ్రంగా ప్రయత్నించవచ్చు. గుజరాత్ టైటాన్స్‌లో శుభమన్ గిల్‌ను నిలువరించగలిగితే చాలు చెన్నైకు విజయం పెద్ద కష్టమేమీ కాదు.
Also read: IPL 2023: ధోని అరుదైన రికార్డు, ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook