IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ ఇవాళే, వర్షంతో మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి, ఎవరు విజేత
IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు ఇవాళ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య తుది పోరు అహ్మాదాబాద్ వేదిక సిద్ధమైంది. క్లైమాక్స్ పోరు అనంతరం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
IPL 2023 Final: అహ్మాదాబాద్ వేదికగా ఇవాళ జరగనున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ ఫైనల్‌తో ఐపీఎల్ 2023 ముగియనుంది. దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికుల్ని అలరించిన ఐపీఎల్ ముగింపు ఉత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఇవాళ్టి ఫైనల్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, నిబంధనలేం చెబుతున్నాయో తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు ఇవాళ అంటే మే 28న అహ్మాదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియంలో జరగనుంది. ఫైనల్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఎందుకంటే క్వాలిఫయర్ 2 జరిగిన రోజు కూడా వర్షం కురిసింది. కానీ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి తగ్గిపోవడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక ఇప్పుడు ఫైనల్‌కు వర్షం పడితే ఫలితం ఎలా ఉంటుంది, నిబంధనలేం చెబుతున్నాయనే వివరాలు తెలుసుకుందాం..
ఐపీఎల్ నిబంధనల ప్రకారం రాత్రి 9.40 గంటలకు ముందు మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్లు అన్నీ యధావిధిగా ఉంటాయి. ఓవర్ల కోత ఉండదు. రెండు జట్లూ తప్పనిసరిగా 20 ఓవర్లు ఆడనున్నాయి. అదే రాత్రి 9.40 గంటల తరువాత ప్రారంభమైతే మాత్రం ఓవర్ల కుదింపు ఉంటుంది. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫలితం నిర్ణయించాలంటే రెండు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడాల్సిందే.
నిర్ణీత సమయంలోగా మ్యాచ్ ప్రారంభం కాకపోతే అదనపు సమయం కేటాయిస్తారు. అంటే 5 ఓవర్ల మ్యాచ్ ఉంటుంది. 5 ఓవర్ల మ్యాచ్ అంటూ జరిగే పరిస్థితి వస్తే రాత్రి 11.56 గంటలకు ప్రారంభమై 12.50 గంటలకు ముగుస్తుంది. ఆ సమయంలో కూడా 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కానిపక్షంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అయితే పిచ్, గ్రౌండ్ అన్నీ మ్యాచ్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలి. సూపర్ ఓవర్ కూడా జరగకపోతే ఫైనల్ మ్యాచ్ రద్దవుతుంది. అదే జరిగితే లీగ్ మ్యాచ్‌లలో పట్టిక ద్వారా ఛాంపియన్ ఎవరనేది నిర్ణయిస్తారు. అంటే లీగ్ దశలో 70 మ్యాచ్‌ల తరువాత ఏ జట్టు అగ్రస్థానంలో ఉందో ఆ జట్టుని విజేతగా ప్రకటిస్తారు.
ఐపీఎల్ 2023 ఫైనల్ పోరుకు రిజర్వ్ డే ప్రకటించలేదు. దాంతో మ్యాచ్ జరిగినా జరగకపోయినా విజేత ఎవరో ఇవాళ తేలిపోనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది గుజరాత్ టైటాన్స్ కావడంతో వర్షం ఆ జట్టుకు ప్రయోజనం కల్గించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook