IPL 2023: ఐపీఎల్ టీ 20 ఫార్మట్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన గేమ్. భారీగా పారితోషికం వస్తుండటంతో ప్రపంచ క్రికెటర్లు ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి వరకూ 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌లో చెన్నై సారధి మహేంద్రసింగ్ ధోనీ మరెవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పైనల్ పోరు ఇవాళ మరి కాస్సేపట్లో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని చరిత్ర సృష్టించనున్నాడు. ఇవాళ జరిగే మ్యాచ్ ఐపీఎల్ లో ధోనీకు 250వ మ్యాచ్. ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడూ 250 మ్యాచ్‌లు ఆడలేదు. సాధ్యం కాలేదు కూడా. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీనే. 


మహేంద్రసింగ్ ధోనీ @ 250 ఐపీఎల్


ఇవాళ జరిగే ఐపీఎల్ 2023 ఫైనల్ ఫైనల్ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య కీలకపోరు జరగనుంది. ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోని 249 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌తో 250 మార్క్ చేరుకోనున్నాడు. ఇప్పటి వరకూ ఏ ఆటగాడు ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. దోనీ తరువాత రెండవ స్థానంలో రోహిత్ శర్మ 243 మ్యాచ్‌లు ఆడగా, మూడవ స్థానంలో ఆర్సీబీ కీపర్ దినేష్ కార్తీక్ 242 మ్యాచ్‌లు ఆడాడు. నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ 237 మ్యాచ్‌లు, ఐదవ స్థానంలో రవీంద్ర జడేజా 225 మ్యాచ్‌లు ఆడారు. ఆరవ స్థానలో పంజాబ్ సారధి శిఖర్ థావన్ 217 మ్యాచ్‌లు, సురేష్ రైనా 205 మ్యాచ్‌లు, రాబిన్ ఊతప్ప 205 మ్యాచ్‌లు , అంబటి రాయుడు 203 మ్యాచ్‌లు రవిచంద్రన్ అశ్విన్ 197 మ్యాచ్‌లతో ఇతర స్థానాల్లో నిలిచారు. 


అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్ 10 క్రికెటర్లలో ఎక్కువమంది సీఎస్కేకు చెందినవారే కావడం విశేషం. ఫైనల్‌లో విజయంతో టైటిల్ సాధిస్తే చెన్నై సూపర్‌కింగ్స్  సారధి మరేంద్రసింగ్ ధోనీ మరో రెండు రికార్డులు నెలకొల్పనున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ 16 టైటిల్ సాధిస్తే ఐదు టైటిళ్లు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ సరసన నిలుస్తాడు. జట్టును ముంబై ఇండియన్స్‌కు సమానంగా నిలుపుతాడు. 


రోహిత్ ఆధ్వర్యంలోని ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 టైటిల్స్ సాధించగా మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 2010, 2011, 2018, 2021 టైటిల్స్ గెల్చుకుంది. ఈసారి టైటిల్ గెలిస్తే అతిపెద్ద వయస్సులో 41 ఏళ్లలో టైటిల్ సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు.


Also read: IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ ఇవాళే, వర్షంతో మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి, ఎవరు విజేత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook