IPL 2023: వికెట్ కీపింగ్ మాత్రమే కాదు.. బౌలింగ్‌కు కూడా సై.. ఈ ముగ్గురు ఆటగాళ్లు స్పెషల్
IPL Records: రికార్డులకు కేరాఫ్ అడ్రస్ ఐపీఎల్. క్రికెటర్ల తమ అద్భుత ఆటతీరుతో గత 16 ఏళ్లుగా అభిమానులను ఉర్రుతలూగిస్తున్నారు. కొందరు ప్లేయర్లు వికెట్ కీపింగ్‌తో పాటు బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. ఆ ప్లేయర్లు ఎవరంటే..?
IPL Records: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించే క్రేజీ లీగ్ ఐపీఎల్ 2023 ప్రారంభమైంది. ఐపీఎల్ అంటేనే అనేక సంచనలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. జట్టు అవసరాన్ని బట్టి ప్లేయర్ ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు రెడీగా ఉంటారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసే బ్యాట్స్‌మెన్‌ను ఐపీఎల్ ఫినిషర్‌గా చూడొచ్చు. బౌలింగ్ చేసే ఆటగాడు ఓపెనర్‌గా వచ్చి సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అదేవిధంగా వికెట్ కీపింగ్ చేసిన ఆటగాళ్లు బౌలర్‌గా కూడా మారారు. ఐపీఎల్‌లో ముగ్గురు ఆటగాళ్లు కీపింగ్‌తో పాటు బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీశారు. వాళ్లు ఎవరో తెలుసుకుందాం..
ఆడమ్ గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరు చెప్పగానే కీపింగ్‌లో అద్భుత విన్యాసాలే గుర్తుకువస్తాయి. ఎప్పుడు వికెట్ కీపింగ్ పాత్ర పోషించే గిల్‌క్రిస్ట్ ఐపీఎల్‌లో బౌలింగ్ కూడా చేశాడు. ఐపీఎలో ఆరో సీజన్‌లో గిల్‌క్రిస్ట్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. ఐపీఎల్‌లో గిల్‌క్రిస్ట్‌కి ఇదే చివరి మ్యాచ్ కాగా.. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా తీశాడు. హర్భజన్ సింగ్‌ను ఔట్ చేశాడు.
అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్నాడు. అంబటి రాయుడు వికెట్ కీపింగ్ చేయడం అందరూ చూశారు. కానీ రాయుడు కూడా ఐపీఎల్‌లో బౌలింగ్ చేశాడు. రాయుడు ఐపీఎల్ 2011 సీజన్‌లో బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులు ఇచ్చాడు. అయితే వికెట్ల తీయలేకపోయాడు.
గురుకీరత్ సింగ్
గురుకీరత్ సింగ్ ఐపీఎల్‌లో మొత్తం 41 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఆటగాడు చాలా మ్యాచ్‌లలో వికెట్ కీపింగ్ చేయడంతోపాటు బౌలింగ్ కూడా చేశాడు. ఐపీఎల్‌లో బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు కూడా 7.46గా ఉంది. గురుకీరత్ 2015, 2016 సీజన్లలో బౌలింగ్ చేశాడు. ఆ తరువాత మళ్లీ బౌలింగ్ చేయలేదు. బ్యాట్స్‌మెన్‌గా 511 పరుగులు చేశాడు గురుకీరత్ సింగ్.
Also Read: LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!
Also Read: Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి=