IPL 2023 LSG vs DC: ఐదేళ్ల తరువాత ఎంట్రీ..సూపర్‌స్పెల్‌తో ప్రత్యర్ధుల నడ్జి విరిచేసిన బౌలర్
IPL 2023 LSG vs DC: ఐపీఎల్ 2023లో ప్రారంభ మ్యాచ్‌లలోనే అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదేళ్ల క్రితం ఏ ఆటతీరుతో ఐపీఎల్‌కు దూరమయ్యాడో..ఇప్పుడు అదే ఆటతీరుతో అందరికీ సమాధానమిచ్చేశాడు. అద్భుతమైన స్పెల్‌తో ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు.
IPL 2023 LSG vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఓ ఆటగాడు ఐదేళ్ల తరువాత తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. 2018లో ఆటుతీరు సరిగ్గా లేక వైదొలగిన పరిస్థితి. ఇప్పుడు ఐదేళ్ల తరువాత తానేంటో రుజువు చేశాడు. 5 వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టు నడ్డి విరిచాడు.
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ఢిల్లీ కేపిటల్స్ జట్టుని 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన నమోదు చేసింది. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు వార్తల్లో నిలిచాడు. ఐదేళ్ల తరువాత ఈ ఆటగాడికి ఐపీఎల్‌లో ఆడే అవకాశమొచ్చింది. ఐపీఎల్‌లో తిరిగి వస్తూనే అద్భుత ప్రదర్శనతో టీమ్‌కు విజయాన్ని అందించాడు.
ఐదేళ్ల తరువాత IPL ఎంట్రీ
ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు హీరోగా మారాడు మార్క్‌వుడ్. అద్బతమైన స్పెల్‌తో ప్రత్యర్ధి జట్టుకు దడపుట్టించాడు. అతని బౌలింగ్ ముందు ఢిల్లీలోని ఏ ఒక్క క్రికెటర్ కూడా నిలవలేకపోయాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులి్చి 5 వికెట్లు సాధించాడు. మార్క్‌వుడ్ నిన్నటి మ్యాచ్‌లో పృథ్వీ షా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, చేతన్ సకారియా వంటి ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపించాడు.
మార్క్‌వుడ్ ఇంతకుముందు 2018లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆడాడు. ఎంఎస్ ధోని నేతృత్వంలో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించింది. కానీ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయకుండా 49 పరుగులు సమర్పించుకున్నాడు. మార్క్‌వుడ్ ఆటతీరు కారణంగా ఐపీఎల్‌లో తిరిగి ఆడే అవకాశం లభించలేదు. ఐపీఎల్‌లో రెండవ మ్యాచ్ ఆడే అవకాశం ఏకంగా ఐదేళ్ల తరువాత లభించింది. మార్క్‌వుడ్ గత సీజన్‌లోనే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వాల్సింది గానీ, గాయం కారణంగా ఆడలేకపోయాడు.
ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌లో ఓపెనర్ కాయిల్ మేయర్స్ 73 పరుగులు సాధించాడు.194 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది. మార్క్‌వుడ్ 5 వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్, రవి బిశ్నోయిలు చెరో 2 వికెట్లు సాధించారు.
Also Read: IPL 2023 CSK vs LSG: బౌలింగ్ మెరుగుపర్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించిన ధోని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook