IPL 2023: రూమ్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సూర్యకుమార్ యాదవ్.. బాలీవుడ్ డైలాగ్స్‌తో సెట్
Suryakumar Yadav Funny Video: సూర్య కుమార్ యాదవ్ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2023 కోసం ముంబై ఇండియన్స్ జట్టుతో చేరిన సూర్య.. హోటల్ రూమ్ ఓపెన్ చేసే సమయంలో పాస్ వర్డ్ మర్చిపోయాడు. డోర్ ఓపెన్ చేసేందుకు బాలీవుడ్ డైలాగ్‌లు చెబుతూ తంటాలు పడ్డాడు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Suryakumar Yadav Funny Video: క్రికెట్ అభిమానులకు నిరీక్షణకు మరో మూడు రోజుల్లో తెరపడనుంది. మార్చి 31వ తేదీ నుంచి క్రికెట్ పండుగ ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటగాళ్లందరూ తమ తమ ఫ్రాంచైజీల్లో చేరుతున్నారు. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ జట్టులో జాయిన్ అయ్యాడు. అయితే సూర్య ఫన్నీ వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. సూర్య తన హోటల్ గది పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలో సూర్య కుమార్ ముందుగా తన యాక్సెస్ కార్డుతో రూమ్ వైపు వెళ్లి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. యాక్సెస్ డినైడ్ అని తలుపులు ఓపెన్ అవ్వలేదు. “యాక్సెస్ నిరాకరించబడింది. పాస్‌వర్డ్ కావాలి.." అంటూ ఓ వాయిస్ వినిపించింది. పలు బాలీవుడ్ చిత్రాలలోని డైలాగ్‌లను పాస్‌వర్డ్‌గా చెప్పి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిచాడు సూర్య. కానీ పదేపదే అదే వాయిస్ రిపీట్ అయింది. 'క్యా గుండా బనేగా రే తూ' అంటూ సూర్య డైలాగ్ చెప్పాడు. కానీ ప్రయోజనం లేకపోయింది.
ఆఖరికి సూర్య 'సూపలా షాట్' అని చెప్పగానే.. హోటల్ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ముంబై ఇండియన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. "పాస్‌వర్డ్ చాలా బాగుంది. కానీ ఆలస్యంగా గుర్తుకు వచ్చింది" అని క్యాప్షన్‌లో రాసింది. సూర్య తన నటనతో నవ్వులు పూయించాడు. ప్రస్తుతం నెట్టంట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 12 లక్షల మందికి పైగా లైక్ చేయగా.. దాదాపు 8 వేల మంది తమ స్పందనలను కామెంట్ చేశారు. ఈ వీడియోపై స్మైలీ ఎమోజీతో విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇచ్చాడు. శిఖర్ ధావన్ కూడా నవ్వుతున్న ఎమోజీతో కామెంట్ చేశాడు.
తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సూర్య.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఒంటి చెత్తో ఎన్నో విజయాలు అందించాడు. ఈ సీజన్‌లో కూడా ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లో తొలి బంతికే డకౌట్ అవ్వడం అభిమానులకు కలవరపరుస్తోంది. ఐపీఎల్ సూర్య తిరిగి పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!
Also Read: CAG Report: కాగ్ సంచలన రిపోర్ట్.. అడగకుండానే ఈ బ్యాంక్‌కు రూ.8,800 కోట్లు ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి