Gujarat Titans Vs Chennai Super Kings Dream 11 Team Tips: ఐపీఎల్‌లో ఆఖరి ఘట్టానికి చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసిపోవడంతో ప్లేఆఫ్స్ సమరం మొదలుకానుంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. లీగ్‌ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో గుజరాత్ 10 మ్యాచ్‌ల్లో గెలిచి 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ 8 విజయాలు, 17 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో మంగళవారం రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు, ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా.. 


చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం బ్యాట్స్‌మెన్లకు, బౌలర్లకు సమాన సహకారాన్ని అందిస్తుంది. పిచ్‌పై బౌన్స్ కారణంగా స్ట్రోక్ ప్లేకి అనుకూలంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్లు షాట్లు ఆడడం సులభంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు దృష్టిలో బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. చెన్నైతో గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి రెండోసారి ఫైనల్‌కు చేరుకోవాలని చూస్తోంది. అయితే సొంతగడ్డపై చెన్నై జట్టును ఓడించడం అంత ఈజీ కాదు.


తుది జట్లు (అంచనా):


గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, దసున్ షనక, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, యష్ ధయాల్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్. 
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, అజింక్య రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దుబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌ పాండే, మహీష్ తీక్షణ. 


డ్రీమ్ 11 టీమ్ టిప్స్..


వికెట్ కీపర్: డెవాన్ కాన్వే
బ్యాట్స్‌మెన్లు: శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానే
ఆల్‌రౌండర్లు: మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా
బౌలర్లు: మహీష్ తీక్షణ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ


Also Read: IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?  


Also Read: Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హ‌ఠాన్మ‌ర‌ణం.. కారణం ఇదే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook