Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హ‌ఠాన్మ‌ర‌ణం.. కారణం ఇదే..!

RRR Actor Ray Stevenson Passed Away: RRR మూవీ రే స్టీవెన్సన్ (58) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కోలుకోలేక కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

Written by - Ashok Krindinti | Last Updated : May 23, 2023, 09:34 AM IST
Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హ‌ఠాన్మ‌ర‌ణం.. కారణం ఇదే..!

 RRR Actor Ray Stevenson Passed Away: వరల్డ్ వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన RRR మూవీలో విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన రే స్టీవెన్సన్ (58) కన్నుమూశారు. ఈ విషయాన్ని పీఆర్ వెల్లడించారు. ఆయన మృతికి అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్తా పత్రిక రిపబ్లికా వెల్లడించింది. 'ఇటలీలో ఇస్చియా ద్వీపకల్పంలో క్యాసినో అనే మూవీ చిత్రీకరిస్తుండగా ఆయన మిస్టరీ ఇల్నెస్‌కు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులకే ఆయన మరణించారు' అని పేర్కొంది. స్టీవెన్ స‌న్ మరణంపై సినీ ప్ర‌పంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు. 

RRR టీమ్ కూడా సంతాపం తెలిపింది.  ‘మీరు ఇకలేరనే విషయం మమ్మల్ని షాక్‌కి గురిచేసింది. మీరెప్ప‌టికీ మా హృద‌యాల్లో నిలిచే ఉంటారు. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నాం.. సార్ స్కాట్..’ అని RRR టీమ్ ట్వీట్ చేసింది. 'మేము ఈ క్లిష్టమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన వయస్సు 56 సంవత్సరాలు. కానీ ఈ స్టంట్ చేసేందుకు ఆయన వెనుకాడలేదు. రే స్టీవెన్‌సన్ సెట్స్‌లో మిమ్మల్ని కలిగి ఉండటాన్ని మేము ఎప్పటికీ గొప్పగా భావిస్తామం. చాలా త్వరగా అయిపోయింది..' అని RRR మూవీలో ఓ సీన్‌కు సంబంధించిన పిక్‌ను షేర్ చేస్తూ రాసుకొచ్చింది. 

 

షాకింగ్ న్యూస్ అంటూ దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. 'షాకింగ్.. ఈ వార్తలను నమ్మలేకపోతున్నాను. రే తనతో సెట్‌కి చాలా శక్తిని, చైతన్యాన్ని తీసుకువచ్చాడు. అతనితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులు కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి..' అని రాజమౌళి రాసుకొచ్చారు.  

 

1964లో మే 25వ తేదీన లిస్బర్న్‌లో రే స్టీవెన్సన్ జన్మించారు. స్టీవెన్‌సన్ 8 ఏళ్ల వయస్సులోనే ఇంగ్లాండ్‌కు వెళ్లి బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో చేరారు. 29 సంవత్సరాల వయస్సులో పట్టభద్రుడయ్యారు. 1990లలో టీవీ షోలతో కెరీర్‌ను మొదలుపెట్టారు. 1998లో 'ది థియరీ ఆఫ్ ఫ్లైట్' సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2000 నుంచి హాలీవుడ్ మూవీస్‌లో అవకాశాలు అందుకున్నారు. ఆంటోయిన్ ఫుక్వా 2004 అడ్వెంచర్ సినిమా ‘కింగ్ ఆర్థర్’ ఆయన మొదటి ప్రధాన చలన చిత్రం కావడం విశేషం. RRR మూవీలో బ్రిటీష్ గ‌వ‌ర్న జ‌న‌ర‌ల్ స్టీవ్ బ‌క్‌స్ట‌న్స్ రోల్‌లో ప్రేక్షకులను మెప్పించారు. విలన్‌గా ఆయన యాక్టింగ్‌ను ఆడియన్స్ అంత ఈజీగా మరచిపోలేరు. 

Also Read: IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?  

Also Read: Bandi Sanjay Speech: కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి: బండి సంజయ్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

  

Trending News