IPL Points Table 2023 Team Standings, RR in Top Rank: శుక్రవారం మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌  56 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. మార్కస్ స్టొయినిస్‌ (72; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కైల్ మేయర్స్‌ (54; 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), నికోలస్ పూరన్‌ (45; 19 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఆయుష్ బదోని (43; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. ఆపై పంజాబ్‌ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. అథర్వ తైడే (66; 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో అత్యధిక స్కోరు చేయగా.. ఓవరాల్‌గా రెండో అత్యధికంగా నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్‌ కింగ్స్‌పై 56 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్‌ నెట్‌ రన్‌రేట్‌ గణనీయంగా పెరిగింది. ఈ విజయంతో లక్నో ఐపీఎల్ 2023లో 8 మ్యాచ్‌లు ముగిసేసరికి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. లక్నో నెట్ రన్‌రేట్ 0.841గా ఉంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 5 గెలిచింది. ఆర్ఆర్ నెట్ రన్‌రేట్ 0.939గా ఉంది. 16వ సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్..  5 గెలిచి పట్టికలో మూడవ స్థానంలో ఉంది. గుజరాత్ నెట్ రన్‌ రేట్ ప్రస్తుతం 0.580గా ఉంది.


ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. 5 గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. ప్రస్తుతం చెన్నై నెట్ రన్‌ రేట్ 0.376గా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 గెలిచి 5వ స్థానంలో ఉంది. బెంగళూరు రన్ రేట్ -0.139గా నిలిచింది. ఆరో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో 4 గెలిచింది. లక్నోపై భారీ ఓటమి తర్వాత పంజాబ్ రన్ రేట్ ఏకంగా మైనస్‌లోకి వెళ్ళింది. ప్రస్తుతం పంజాబ్ రన్ రేట 0.510ఆ ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.


ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివరి మూడు స్థానాల్లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ముంబై.. 2021, 2022లో ప్లే ఆప్స్ చేరలేదు. ఈ సీజన్లో కూడా వరుస ఓటములతో పట్టికలో 8వ స్థానంలో ఉంది. ముంబై మూడు విజయాలతో 6 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో ఉంది. తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా దారుణ ఆటతో 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఐపీఎల్ 2023లో వరుసగా ఐదు మ్యాచులు ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ అట్టడుగున ఉంది. ఢిల్లీ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్స్ ఉన్నాయి. 


Also Read: Highest IPL Team Scores: హిస్టరీ క్రియేట్ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. ఐపీఎల్‌లో రెండో జట్టుగా రికార్డు!  


Also Read: Best Mileage Bikes 2023: అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ ఇవే.. కళ్లు మూసుకుని కొనేయొచ్చు! ధర కూడా తక్కువే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.