IPL 2023 Points Table: రాజస్థాన్‌పై ముంబై విజయం.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు! టాప్‌లో గుజరాత్
IPL Points Table 2023 Team Standings, Gujarat Titans in Top Rank. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానానికి చేరుకుంది.
Orange and Purple Cap IPL 2023 Points Table know the latest Updated News: ఆదివారం రోజున ఐపీఎల్ డబుల్ ధమాకా క్రికెట్ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. నాలుగు ఇన్నింగ్స్‌లలో 200లకు పైగా రన్స్ నమోదు కావడంతో ఫాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించగా.. రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ముంబై చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. టీమ్ డేవిడ్ మొదటి మూడు బంతుల్లో భారీ సిక్సులు బాదడంతో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం అనంతరం ముంబై ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ 8 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. గత రాత్రి ముంబై ఇండియన్స్‌పై ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్ పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ ఆడిన 9 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో నిలిచింది. లక్నో ఆడిన 8 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్స్ సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. చెన్నై, పంజాబ్ ఖాతాలో తలో 10 పాయింట్లు ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్స్ సాధించింది. ముంబై ఇండియన్స్ పట్టికలో ఏడవ స్థానంలో ఉండగా.. 8 మ్యాచ్‌లలో 4 విజయాలు అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. కోల్‌కతా 9 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పట్టికలో తొమ్మిదో స్థానంలో అండగా.. 8 మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించింది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్రస్తుతం టాప్ 4లో ఉన్నాయి.
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఇచ్చే క్యాప్ Orange Cap) లిస్టులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి 428 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌పై జైస్వాల్ 124 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 8 మ్యాచ్‌ల్లో 422 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు డెవాన్ కాన్వే 414 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (354 పరుగులు) మరియు శుభ్‌మన్ గిల్ (333 పరుగులు) ఈ సీజన్‌లో మొదటి ఐదు జాబితాలో ఉన్నారు.
ఐపీఎల్ 203 పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే క్యాప్ Purple Cap) పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే (17 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 15 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ (14) మూడో స్థానములో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 14 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 13 వికెట్లతో టాప్ ఫైవ్ జాబితాలో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.