IPL 2023 Updates: చెన్నై వేదిక, ధోనీ కెప్టెన్సీ అంటే ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది ధోనీ సేన. భారీ లక్ష్యం కాకపోయినా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఫైనల్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది చెన్నై సూపర్‌కింగ్స్. అటు గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి తడబడి చివరికి ఓటమిపాలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 1 మ్యాచ్ చెన్నై చేపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేధించకుండా ధోనీ తనదైన వ్యూహాలతో గుజరాత్ టైటాన్స్ జట్టును నిలువరించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 60 పరుగులు, డేవన్ కాన్వే 34 బంతుల్లో 40 పరుగులు సాధించారు. 2 పరుగుల వద్ద లభించిన లైఫ్‌ను రుతురాజ్ గైక్వాడ్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తరువాత విజృంభించి ఆడాడు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 172 పరుగులే చేయగలిగింది. 


173 పరుగుల లక్ష్యం. పైగా క్వాలిఫయర్ -1 మ్యాచ్. గెలిస్తే నేరుగా ఫైనల్స్‌లోకి వెళ్లే పరిస్థితి. సులభంగా అందుకోవల్సిన టార్గెట్‌ను చేరుకోవడంతో గుజరాత్ టైటాన్స్ తడబడింది. వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి తత్తరపాటుకు లోనైంది. ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించే దిశగా ముందుకు సాగలేదనే చెప్పాలి. శుభమన్ గిల్ 38 బంతుల్లో 42 పరుగులు, రషీద్ ఖాన్ 16 బంతుల్లో 30 పరుగులు మినహా మరెవరూ రాణించలేదు. రషీద్ ఖాన్ మాత్రం చెన్నై సూపర్‌కింగ్స్‌ను చివర్లో భయపెట్టినా చెన్నై విజయాన్ని ఆపలేకపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆలవుట్ అయింది. ఫలితంగా 15 పరుగుల తేడాతో విజయం అందుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు నేరుగా ఫైనల్స్‌లో ప్రవేశించింది. 


చెన్నై సూపర్‌కింగ్స్ ఈ విజయంతో నేరుగా ఫైనల్స్‌లో ప్రవేశించింది. అటు రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇవాళ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో గుజరాత్ టైటాన్స్ మరోసారి తలపడనుంది. అంటే గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్ చేరేందుకు మరో అవకాశముంది. 


ఈ విజయంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో పదోసారి ఫైనల్‌లో ప్రవేశించినట్టైంది. ఇందులో ఇప్పటివరకూ నాలుగుసార్లు టైటిల్ గెలవగా, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. టోర్నీ మొత్తంలో గుజరాత్ టైటాన్స్ తొలిసారి ఆలవుట్ అవడం గమనార్హం. 


Also read: GT vs CSK Qualifier 1: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే! ఫైనల్ బెర్త్ ఎవరిదో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook