GT vs CSK Qualifier 1: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే! ఫైనల్ బెర్త్ ఎవరిదో

GT vs CSK Qualifier 1, Gujarat Titans have won the toss and have opted to field. ఐపీఎల్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో క్వాలిఫయర్‌ 1 మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య తొలి క్వాలిఫయర్‌ జరగనుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : May 23, 2023, 07:32 PM IST
GT vs CSK Qualifier 1: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే! ఫైనల్ బెర్త్ ఎవరిదో

Gujarat Titans have won the toss and have opted to field: ఐపీఎల్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో క్వాలిఫయర్‌ 1 మ్యాచ్ జరగనుంది. టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య తొలి క్వాలిఫయర్‌ జరగనుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు. యశ్ దయాళ్ స్థానంలో దర్శన్ నల్కండే వచ్చాడు. మరోవైపు తాము ఎలాంటి మార్పులు చేయలేదని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు.  

ఈ మ్యాచులో గెలిచి తొలి ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లు చూస్తున్నాయి. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ప్లేఆఫ్స్‌లోని మ్యాచ్‌లు వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే రిజర్వ్ డే ఉంటుంది. ఈ రోజు మ్యాచ్ సాధ్యం కాకపోతే రేపు కంటిన్యూ అవుతుంది. ఇక ఐపీఎల్‌ 2023లో రెండు దీటైన జట్ల మధ్య పోరు కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), డాసున్ శనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ.
చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానె, అంబటి రాయుడు, శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు:
గుజరాత్: విజయ్‌ కుమార్, కేఎస్ భరత్, జయంత్ యాదవ్, సాయి సుదర్శన్, శివమ్ మావి.
చెన్నై: మతీశ పతిరణ, మిచెల్ శాంటర్న్‌, సేనాపతి, షేక్ రషీద్‌, ఆకాశ్‌ సింగ్. 
Also Read: నార్మల్ డెలివరీలో ఒకేసారి ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. అందరూ ఆడపిల్లలే!

Also Read: Simple One Electric Scooter: సింపుల్‌ వన్‌ ఈవీ వచ్చేసింది.. సింగిల్ ఛార్జింగ్‌పై 212 కిమీ ప్రయాణం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

Trending News