IPL 2023: ఐపీఎల్ 2023 ముగింపుకు ఇక ఫైనల్ పోరు మాత్రమే మిగిలింది. అత్యంత కీలకమైన క్వాలిఫయర్2లో గుజరాత్ ఘన విజయం సాధించి ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ముంబై ఇంటికి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 2 మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఓ పెనుతుపానులా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను ఏ స్థాయిలోనూ ముంబై ఇండియన్స్ నిలువరించలేకపోయింది. శుభమన్ గిల్ విధ్వంసకర సెంచరీతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతి ఒక్క బాల్ సిక్సర్ లేదా బౌండరీకే తరలించాడు. వరుసగా మూడవ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్ అత్యధిక పరుగుతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 233 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రారంభంలో శుభమన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడం ముంబై ఇండియన్స్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. అక్కడి నుంచి శుభమన్ గిల్ రెచ్చిపోయాడు. మొదటి 50 పరుగుల్ని 32 బంతుల్లో పూర్తి చేసిన గిల్, ఆ తరువాత 50 పరుగుల్ని కేవలం 17 బంతుల్లో పూర్తి చేశాడు. అంటే కేవలం 49 బంతుల్లో సెంచరీ సాధించేశాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రత్యర్ధి బౌలింగ్‌ను శుభమన్ గిల్ ఊచకోత కోశాడు.


అ తరువాత 234 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ముందు వధేరా, రోహిత్ శర్మ వికెట్లు వెనువెంటనే పడిపోయాయి. గ్రీన్ గాయపడి వెనుతిరిగాడు. ఇక తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైలో ఆశలు చిగురింపజేయడమే కాకుండా కచ్చితంగా గెలిపిస్తాడనే నమ్మకం కల్గించాడు. కేవలం 14 బంతుల్లో 43 పరుగులు చేసి..రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో ముంబై నిరాశకు లోనైంది. షమీ బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో ఏకంగా నాలుగు వరుస ఫోర్లు , ఒక సిక్సర్ కొట్టడం విశేషం. తిలక్ వర్మ తరువాత సూర్య కుమార్ యాదవ్, తిరిగి క్రీజ్‌లో వచ్చిన గ్రీన్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అంతలోనే గ్రీన్ ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో ఇక అంతా ముగిసిపోయింది. సూర్యకుమార్ యాదవ్ అవుట్ తరువాత వికెట్లు ఒకదానివెంట ఒకటిగా పడిపోయాయి. దాంతో 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలవుట్ అయింది. 


మంబై ఇండియన్స్ జట్టుపై ఘన విజయంతో ఐపీఎల్ 2023 ఫైనల్‌కు చేరుకుంది గుజరాత్ టైటాన్స్ జట్టు. రేపు అంటే మే 28వ తేదీన చెన్నై సూపర్‌కింగ్స్‌తో గుజరాత్ టైటిల్ పోరుకు సిద్దం కానుంది. 


Also read: GT vs MI IPL 2023 Qualifier 2: టాస్ గెలిచిన ముంబై.. మార్పులతో ఇరు జట్లు! ఫైనల్ చేరేది ఎవరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook