Royal Challengers Bangalore vs Delhi Capitals Playing 11 Out: ఐపీఎల్‌ 2023లో భాగంగా నేడు డబుల్‌ బొనాంజా ఉంది. మరికొద్దిసేపట్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొట్టనున్నాయి. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు ఐపీఎల్ 2023 టోర్నీలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మూడు మ్యాచులు ఆడి.. ఒకదాంట్లోనే విజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం నాలుగు మ్యాచులు ఆడి.. అన్నింట్లోనూ పరాజయం పాలైంది. దాంతో ఇవాళ్టి మ్యాచ్‌లోనైనా ఖాతా తెరవాలని డేవిడ్ సేన చూస్తోంది. బెంగళూరు కూడా మరో విజయం సాధించాలని చూస్తోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. 



తుది జట్లు:
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.
ఢిల్లీ: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్.


ఇంపాక్ట్‌ ప్లేయర్స్:
ఢిల్లీ: పృథ్వీ షా, ముకేశ్‌ కుమార్, ప్రవీణ్‌ దూబే, సర్ఫరాజ్‌ ఖాన్, చేతన్ సకారియా. 
బెంగళూరు: సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, డేవిడ్ విల్లే, ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్‌ రావత్. 


Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్‌ 203 మాత్రం..!  


Aslo Read: Harry Brook Century: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.