Royal Challengers Bangalore Vs Gujarat Titans Latest Updates: ప్లేఆఫ్స్‌ చేరేందుకు తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బెంగుళూరు భారీ వర్షం కురుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నస్వామి స్టేడియం మొత్తం కవర్లతో కప్పివేశారు. భారీ వడగళ్లు కూడా కురవడంతో మ్యాచ్‌ జరుగుతుందో లేదో అని ఆర్‌సీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షం ఆగిపోయినా.. మ్యాచ్‌ సమయానికి మళ్లీ కురిసే అవకాశం కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఒకకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే.. ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో ముంబై జట్టు ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై గెలిచి.. ఈ మ్యాచ్‌ క్యాన్సిల్ అయితే ఆర్‌సీబీ ప్రయాణం ముగుస్తుంది. వర్షం కురవ కూడదని బెంగుళూరు అభిమానులు ప్రార్థిస్తున్నారు.


చిన్నస్వామి స్టేడియం హై క్వాలిటీ సబ్ ఎయిర్ డ్రైనేజీ సిస్టమ్‌ను కలిగి ఉంది. వర్షం మధ్యలో కురిసి ఆగిపోయినా.. గ్రౌండ్‌ను త్వరగా సిద్ధం చేసే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి 7 గంటల వరకు ఉష్ణోగ్రత 27 డిగ్రీల వరకు ఉంటుంది. ఆ సమయంలో ఆకాశం 98 శాతం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వరుణుడు విలన్‌గా మారితే ఆర్‌సీబీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.


 




ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్, బెంగుళూరు, ముంబై జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. రాజస్థాన్ గ్రూప్ దశ మ్యాచ్‌లు అన్ని అయిపోయాయి. ముంబై, బెంగుళూరు మ్యాచ్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై గెలిచి.. గుజరాత్ చేతిలో ఆర్‌సీబీ ఓడిపోతే రోహిత్ సేన ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ముంబై ఓడి.. గుజరాత్ చేతిలో భారీ తేడాతో ఆర్‌సీబీ కూడా ఓడిపోతే రాజస్థాన్‌కు అవకాశం ఉంటుంది. ముంబై ఓడిపోయి.. గుజరాత్‌తో మ్యాచ్‌ రద్దయినా బెంగుళూరు జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతోంది. ప్లేఆఫ్స్‌ చేరే జట్ల భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది.


Also Read: Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ..!  


Also Read: Chennai Super Kings: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నై షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook