Chennai Super Kings IPL: మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్. ఇప్పటివరకు మొత్తం 10 సార్ల ఫైనల్ చేరుకోగా.. అందులో ఐదుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. రవీంద్ర జడేజా చివరి రెండు బంతులను 6,4 బాది చెన్నైకు తిరుగులేని విజయాన్ని అందించాడు. జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్ అదగొట్టినా.. ఆ టీమ్ ఆటగాళ్లకు పెద్దగా అవార్డులు రాలేదు. ఈ సీజన్‌లో ఆరెంజ్‌, పర్పుల్ క్యాప్ అవార్డులను గుజరాత్ ఆటగాళ్లకు గెలుచుకున్నారు. ఆరెంజ్ క్యాప్ శుభ్‌మన్ గిల్ అందుకోగా.. పర్పల్ క్యాప్ మహ్మద్ షమీ గెలుచుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌ అవార్డుల విషయానికి వస్తే.. ఐదు టైటిళ్లతోపాటు అనేక అవార్డులు అందుకున్న చెన్నై ఖాతాలో ఇప్పటివరకు ఓ అవార్డు మాత్రం చేరలేదు. చెన్నైకి చెందిన ఒక్క ఆటగాడు కూడా ఒక్కసారి కూడా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ టైటిల్‌ను గెలుచుకోలేకపోయాడు. చెన్నైతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. 


ఇక ఢిల్లీ, పంజాబ్, లక్నో, బెంగళూరు జట్లు ఐపీఎల్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేకపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. లక్నో జట్టు పర్పుల్ క్యాప్ కూడా గెలవలేకపోయింది. అయితే ఈ జట్టు ఆడింది రెండు సీజన్లే కాబట్టి.. భవిష్యత్‌లో గెలుచుకునే అవకాశం ఉంది. గుజరాత్, లక్నో ఆటగాళ్లు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకోలేదు. అదేవిధంగా లక్నో, బెంగళూరు, కోల్‌కతా జట్ల ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఫెయిర్‌ప్లే అవార్డును విన్ అవ్వలేదు.


రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో దుమ్ములేపాడు. ఈ యంగ్ ప్లేయర్ సూపర్ పర్ఫామెన్స్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది. ఈ సీజన్‌ జైస్వాల్ 625 పరుగులు చేశాడు. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫెయిర్ ప్లే అవార్డును గెలుచుకుంది. ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ రేసులో రషీద్ ఖాన్, యశస్వి జైస్వాల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.


Also Read: Bandi Sanjay: A నుంచి Z వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవే.. బండి సంజయ్ కౌంటర్   


Also Read: Farmer Schemes in India: పీఎం మోదీ పాలనకు తొమ్మిదేళ్లు.. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , FacebooKమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి