IPL 2023: గ్రౌండ్లో నితీష్ రాణా-హృతిక్ షోకీన్ ఫైట్.. మ్యాచ్ రిఫరీ ఆగ్రహం
Nitish Rana Vs Hrithik Shokeen: నితీష్ రాణా, హృతిక్ షోకీన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిమానాకు దారి తీసింది. షోకీన్ బౌలింగ్‌లో ఔట్ అయిన రాణా.. పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో మాటామాట అనుకున్నారు. దీంతో రిఫరీ ఫైన్ విధించాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా సూర్యకుమార్ యాదవ్ కూడా జరిమానాకు గురయ్యాడు.
Nitish Rana Vs Hrithik Shokeen: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును అలవోకగా ఓడించిన ముంబై ఇండియాన్స్.. ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అటు కోల్‌కతాకు ఇది వరుసగా రెండో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. వెంకటేష్ అయ్యర్ శతకంతో చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 రన్స్ చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి మరో 14 బంతులు మిగిలి ఉండగానే గెలుపును సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వెంకటేష్ అయ్యర్‌కు దక్కింది.
ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా, ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హృతిక్ షోకీన్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరికీ ఫైన్ పడింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా జరిమానకు గురయ్యాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా సూర్యకు ఫైన్ పడింది. నితీష్ రాణాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం, హృతిక్ షోకీన్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.
మ్యాచ్ తొమ్మిదో ఓవర్ హృతిక్ షోకీన్ వేయగా.. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో పెవిలియన్‌కు వెళుతుండుగా.. షోకీన్, రానా మధ్య మాటల వాగ్వాదం జరిగింది. ఇతర ఆటగాళ్లు వచ్చి నితీష్ రాణాకు సర్దిచెప్పి పంపించారు. ఈ వాగ్వాదం మ్యాచ్ రిఫరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం లెవెల్ 1 నేరాన్ని అంగీకరించాడు రానా. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం లెవల్ 1 నేరాన్ని హృతిక్ షోకీన్ కూడా అంగీకరించాడు. దీంతో ఇద్దరికీ జరిమానా పడింది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. త్వరలోనే మరో డీఏ పెంపు..?
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడడంతో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించారు. అయితే నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేపోవడంతో స్లో ఓవర్ రేట్ ఫైన్ పడింది. మ్యాచ్ రిఫరీ సూర్యకు రూ.12 లక్షల జరిమానా విధించాడు. సూర్యకు మొదటి తప్పు కింద కేవలం జరిమానాతో సరిపెట్టారు.
Also Read: Arjun Tendulkar IPL: తమ్ముడు అర్జున్ బౌలింగ్.. స్టాండ్స్‌లో సారా టెండూల్కర్ సందడే సందడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook