7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. త్వరలోనే మరో డీఏ పెంపు..?

7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటనపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 12:26 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. త్వరలోనే మరో డీఏ పెంపు..?

7th Pay Commission Latest Update: ఇటీవలె డీఏ పెంపు ప్రకటనతో సంతోషంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే మరో గుడ్‌న్యూస్ రాబోతుందా..? ఈ ఏడాదికి రెండో డీఏ పెంపు ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం అప్పుడే అడుగులు వేస్తుందా..? అంటే నిపుణులు అవుననే చెబుతున్నారు. మార్చి చివరి వారంలో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్‌ అలవెన్స్‌ను 4 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి డీఏ పెరిగింది. తాజాగా కేంద్ర ఉద్యోగులకు మరో కానుక ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెంచుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉండనుంది.

గత నెల మార్చి నెలలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చింది. డీఏను 42 శాతానికి పెంచి.. ఈ పెంపును జనవరి 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు తదుపరి డీఏ జూలై 1 నుంచి వర్తిస్తుంది. ఈ సారి కూడా డీఏ, డీఆర్ నాలుగు శాతం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉండగా.. జూలై 1 నుంచి వర్తించే డీఏ 46 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది డీఏ పెంపు ప్రకటన ఆగస్టులో వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా రెండో డీఏను సెప్టెంబర్-అక్టోబర్‌లో మధ్యలో ప్రకటిస్తారు. కానీ ఈ ఏడాది ఆగస్టులోనే ప్రకటించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగుల డీఏను కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే. ఇదేక్రమంలో మరోసారి నాలుగు శాతం పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి  

కేంద్ర ఉద్యోగుల డీఏను 46 శాతానికి పెంచితే.. జీతంలో పెరుగుదల కూడా భారీగా ఉండనుంది. ఉదాహరణకు ఉద్యోగి బేసిక్ పే రూ.18 వేలు అయితే.. ప్రస్తుతం 42 శాతం చొప్పున రూ.7560 డీఏ పొందుతున్నారు. డీఏ 46 శాతానికి పెరిగితే.. కరువు భత్యం 8,280 రూపాయలకు చేరుతుంది. ప్రతి నెలా రూ.720 (ఏటా రూ.8640) పెరగనుంది. డీఏ పెంపుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:  Arjun Tendulkar IPL: తమ్ముడు అర్జున్‌ బౌలింగ్.. స్టాండ్స్‌లో సారా టెండూల్కర్ సందడే సందడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News