IPL 2023 Retirement: ఐపీఎల్ 2023 అనంతరం రిటైర్మెంట్ ఇచ్చే 5 ప్లేయర్స్ వీళ్లే.. ముందువరుసలో ఎంఎస్ ధోనీ!
Retirement Players List After IPL 2023. ఐపీఎల్ 2023 అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు.
India Retirement Players List After IPL 2023: భారత గడ్డపై క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా అన్ని మ్యాచులు అభిమానులను అలరిస్తున్నాయి. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగుతుండడంతో ఫాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు.
ఎంఎస్ ధోనీ (MS Dhoni):
భారత క్రికెట్ చరిత్రలో మాత్రమే కాదు ఐపీఎల్‌లోనూ ఎంఎస్ ధోనీ ఓ బ్రాండ్. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. చెన్నైకి నాలుగు ట్రోఫీలు అందించి ఉత్తమ సారథిగా ఉన్నాడు. ఐపీఎల్ 2022 అనంతరం ధోనీ రిటైర్మెంట్ ఇస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సీజన్ కూడా ఆడుతున్నాడు. అయితే వయసు రీత్యా ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి.
దినేశ్ కార్తిక్ (Dinesh Karthik):
ఐపీఎల్ 2022లో ఇరగదీసిన దినేశ్ కార్తిక్ ఇప్పుడు ఆకట్టులేకపోయిన్నాడు. బెంగళూరు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా విఫలమవుతున్నాడు. కోల్‌కతాకు కెప్టెన్‌గా వ్యవహరించిన 37 ఏళ్ల కార్తిక్.. వచ్చే సీజన్ ఆడకపోవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాఖ్యాతగా మారిన డీకే అందులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
అంబటి రాయుడు (Ambati Rayudu):
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎన్నో విజయాలు అందించిన అంబటి రాయుడు.. 180 ఇన్నింగ్స్‌లలో 4 వేలకు పైగా పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లోనే తన రిటైర్మెంట్‌పై ట్వీట్ చేసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకొని రాయుడుకి ఇదే ఆఖరిది కానున్నట్లు సమాచారం. 37 ఏళ్ల రాయుడు రాజకీయరంగ ప్రవేశం చేస్తాడనే వార్తలూ వచ్చాయి.
ఇషాంత్ శర్మ (Ishant Sharma):
2021లో ఇషాంత్ శర్మ చివరిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడాడు. ఇప్పుడు కూడా జట్టులో భాగమైనప్పటికీ.. మ్యాచులు మాత్రం ఆడడం లేదు. గత సీజన్‌లో ఇషాంత్‌ను ఢిల్లీ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. రెండేళ్లుగా ఆడని ఇషాంత్.. రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అమిత్ మిశ్రా (Amit Mishra):
టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతిని గింగరాలు తిప్పుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల లెగ్ స్పిన్నర్లలో ఒకడు. ఐపీఎల్ 2023లో లక్నోకు ఆడుతున్న అమిత్.. అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన మిశ్రాకు ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: MS Dhoni Interview: ఆ ఇద్దరు మరికాసేపు క్రీజ్‌లో ఉండుంటే.. మ్యాచ్ 18 ఓవర్లలోనే ముగిసేది: ఎంఎస్ ధోనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.