LSG vs GT Dream11 Tips: గుజరాత్ టైటాన్స్‌తో లక్నో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీకోసం..
Lucknow Super Giants Vs Gujarat Titans Dream 11 Team Prediction: లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు శనివారం తలపడనున్నాయి. రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
Lucknow Super Giants Vs Gujarat Titans Dream 11 Team Prediction: ఐపీఎల్ నేడు బిగ్‌ఫైట్ జరగనుంది. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో లక్నో నాలుగు విజయాలు సాధించగా.. గుజరాత్ ఐదు మ్యాచ్‌లో ఆడి మూడింటిలో గెలుపొందింది. ఈ నేపథ్యంలో శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఎకానా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు రెండు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
పిచ్ రిపోర్ట్ ఇలా..
ఎకానా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 121 నుంచి 193 స్కోరు చేసింది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది. పిచ్ నుంచి ఫాస్ట్ బౌలర్లకు మంచి సహకారం అందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. లోస్కోరింగ్ గేమ్‌గా సాగే ఛాన్స్ ఉంది.
గత సీజన్‌లో గుజరాత్, లక్నో జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా.. రెండింటిలోనూ హార్థిక్ సేననే విజయం సొంతం చేసుకుంది. మరోసారి హాట్ ఫేవరెట్‌గా గుజరాత్ కనిపిస్తున్నా.. కేఎల్ రాహుల్ నాయకత్వంలోనే లక్నో అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది. కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ ఒంటి చెత్తో మ్యాచ్‌ను గెలిపించగలరు. దీపక్ హుడా ఒక్కడే ఇప్పటివరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఆయుష్ బదౌనీ, కృనాల్ పాండ్యా సత్తాచాటుతుండగా.. బౌలింగ్ మార్క్ వుడ్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. నవీన్ ఉల్ హక్, యుధ్వీర్ సింగ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా చక్కగా రాణిస్తున్నారు.
ఇక గుజరాత్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కాస్త బలహీనంగా మారింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా మెరుపులు కేవలం ఒకటి రెండుషాట్లకే పరిమితమవుతున్నాయి. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాపై అతిగా ఆధారపడుతోంది. సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ పుంజుకుంటే బ్యాటింగ్‌లో కష్టాలు తీరినట్లే. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోస్ లిటిల్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
Also Read: Sachin Tendulkar: 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీకి సచిన్ చెప్పిన సీక్రెట్ ఇదే..!
రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదౌనీ, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, నవీర్ ఉల్.
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), బి.సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ.
డ్రీమ్ 11 టీమ్: (LSG vs GT Dream 11 Team)
వికెట్ కీపర్: నికోలస్ పూరన్
బ్యాటర్లు: శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్ (కెప్టెన్)
బౌలర్లు: రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook