Sachin Tendulkar Twitter Chitchat: క్రికెట్ దేవుడు, టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించారు. #AskSachin అంటూ చిట్‌చాట్ చేశారు. అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సచిన్ సమాధానం ఇచ్చారు. కొందరు ఫొటోలను షేర్ చేస్తూ ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఫన్నీ ఆన్సర్లు చెప్పారు. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఔటైన తర్వాత సచిన్ పెవిలియన్‌కు వెళుతూ.. తరువాత క్రీజ్‌లోకి వస్తున్న విరాట్ కోహ్లీకి తాను ఏమి చెప్పాడో కూడా అభిమానులతో పంచుకున్నారు.
శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ను మలింగ డకౌట్ చేయగా.. అనంతరం 18 రన్స్ చేసిన సచిన్‌ను కూడా పెవిలియన్‌కు పంపించాడు. డగౌట్‌కు వెళుతున్న సచిన్‌కు క్రీజ్‌లోకి వస్తున్న కోహ్లీ ఎదురయ్యాడు. ఈ క్రమంలో కోహ్లీకి సచిన్ ఏదో విషయం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ అభిమాని షేర్ చేస్తూ.. మీరు విరాట్‌కు ఏం చెప్పారని అడిగాడు. ఇందుకు సచిన్ సమాధానం ఇస్తూ.. 'బంతి కాస్త ఇంకా స్వింగ్ అవుతోంది..' అని చెప్పానని గుర్తు చేసుకున్నారు. 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గంభీర్‌తో కలిసి కోహ్లీ ఆదుకున్నాడు. సచిన్ చెప్పిన మాటతో క్రీజ్‌లో జాగ్రత్తగా ఆడుతూ.. 49 బంతుల్లో 35 రన్స్ చేశాడు.
ధోనిని ఏమనిపిలుస్తారని మరో అభిమాని అడగ్గా.. తాను ఎమ్ఎస్ అని పిలుస్తానని చెప్పారు సచిన్. మీకు ఇష్టమైన షాట్ ఏదని అడగ్గా.. అప్పర్-కట్, స్ట్రెయిట్ డ్రైవ్ అని చెప్పారు. వాంఖడే తరువాత తనకు రెండో ఇష్టమైన స్టేడియం చెపాక్ అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సచిన్‌కు ఫేవరెట్ గ్రౌండ్ వాంఖడే అని అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. ఇష్టమైన ఫుడ్ ఏదని అడగ్గా.. బిరియానీ అని అన్నారు. ఇష్టమైన ఫుట్‌బాల్ ప్లేయర్ ఎవరని అడగ్గా.. మెస్సీ పేరు చెప్పారు.
"Ab bhi ball thoda swing ho raha hai!" https://t.co/7V5WFbkmQx
— Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023
ట్విట్టర్ బ్లూటిక్ తీసేసింది కదా.. ఇప్పుడు రియల్ సచిన్ టెండూల్కర్ అని ఎలా గుర్తుపట్టాలని ఓ అభిమాని అడగ్గా.. స్మైలీ సెల్ఫీ పిక్ షేర్ చేస్తూ ఇక నుంచి ఇదే నా బ్లూటిక్ వెరిఫికేన్ అని జవాబిచ్చారు. చివరగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకలేకపోతున్నానని.. అయితే ఇంట్రాక్ట్ అవుతుంటే మస్త్ మాజా వస్తుందన్నారు. త్వరలోనే మళ్లీ కలుసుకుందామన్నారు.
Possibly this Upper Cut- the one I played against @BrettLee_58 in Perth! https://t.co/HC4pHF5dcj
— Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook