LSG Vs MI Dream11 Team Prediction: ముంబై జోరుకు లక్నో బ్రేకులు వేస్తుందా..? ప్లే ఆఫ్స్ చేరేది ఎవరు..? డ్రీమ్ 11 టీమ్ ఇలా..

Lucknow Super Giants Vs Mumbai Indians Dream11 Team Prediction Today: ప్లే ఆఫ్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌లో బెర్త్‌కు మరింత చేరువ అవుతుంది.
Lucknow Super Giants Vs Mumbai Indians Dream11 Team Prediction Today: ఐపీఎల్-16 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ 63వ లీగ్ మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 14 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. అటు లక్నో జట్టు 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే.. ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఫిక్స్ చేసుకుంటుంది. లక్నో ఈ మ్యాచ్‌లో గెలిచినా.. చివరి మ్యాచ్‌లో కూడా తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది. మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్టు, హెడ్ టు హెడ్ రికార్డులు, ప్లేయింగ్ ఎలెవన్, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..
పిచ్ రిపోర్ట్ ఇలా..
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం గత మూడేళ్లలో మొత్తం 30 టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 140 పరుగుల కంటే తక్కువగానే ఉంది. స్పిన్నర్లు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 53 శాతం వికెట్లు స్పిన్నర్లు తీయగా.. 47 శాతం వికెట్లను పేసర్లు తీయగలిగారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. మరోసారి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. లోస్కోరింగ్ గేమ్ ఆసక్తికరంగా జరిగే ఛాన్స్ ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
ఈ సీజన్‌లో రెండు జట్ల ఇదే తొలి మ్యాచ్. గత సీజన్‌లో రెండుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో రెండు మ్యాచ్‌ల్లోనూ లక్నో జట్టే విజయం సాధించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగ్గా.. లక్నో 18 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో మరోసారి లక్నో 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సారి రెండు జట్లు బలంగా కనిపిస్తున్నా.. ముంబై ఇండియన్స్‌ది కాస్త పైచేయింగా కనిపిస్తోంది.
తుది జట్లు ఇలా..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, అర్షద్ ఖాన్, జాసన్ బెహ్రెండోర్ఫ్
లక్నో సూపర్ జెయింట్స్: కైల్ మేయర్స్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), పి.మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా (కెప్టెన్), రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, అవేష్ ఖాన్, అమిత్ మిశ్రా.
డ్రీమ్ 11 టీమ్ టిప్స్..
వికెట్ కీపర్: ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్
బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, నేహాల్ వధేరా
ఆల్‌రౌండర్లు: మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, కామెరూన్ గ్రీన్
బౌలర్లు: అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్
Also Read: Bhuvneshwar-Gill Record: ఐపీఎల్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించిన భువనేశ్వర్, గిల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి