Kedar Jadhav replaces David Willey for RCB in IPL 2023: ఐపీఎల్ 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా స్టార్ ప్లేయర్స్ మెగా టోర్నీలో ఆడడం లేదు. రజత్ పటీదార్, రీస్ టోప్లీ, విల్ జాక్స్ గాయాలతో టోర్నీకి దూరం కాగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ విల్లే చేరాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. విల్లేకు గాయం అయింది. పాదానికి బలమైన గాయం కావడంతో 16వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ విల్లే స్థానంలో మొన్నటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడిన వెటరన్ బ్యాటర్ కేదార్ జాదవ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. జాదవ్‌ను ఆర్‌సీబీ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు విల్లే స్థానంలో జాదవ్‌ను ఆర్‌సీబీ ఎంపిక చేసింది. కేదార్ జాదవ్ రిప్లేస్‌ మెంట్‌కు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేసారు. 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక మార్పు జరిగింది. గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ విల్లే స్థానంను కేదార్ జాదవ్‌తో భర్తీ చేసింది' అని పేర్కొంది. 


2010లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్ ఇప్పటివరకు 93 మ్యాచ్‌ల్లో 1196 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 69. 2010లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జాదవ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. జాదవ్ 2016-17 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున 17 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. 2021 ఎడిషన్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022, 2023 సీజన్లలో వేలంలో అమ్ముడుపోలేదు. ఇప్పుడు బెంగళూరు ఒక కోటికి తీసుకుంది. 


ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో కేదార్ జాదవ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతన్ని వేలానికి వదిలేసింది. 2021 వేలంలో రూ.2 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ జాదవ్‌ని కొనుగోలు చేసింది. దురదృష్టవశాత్తు హైదరాబాద్ పట్టికలో అట్టడుగున నిలిచింది. వరుసగా రెండు సీజన్లు ఐపీఎల్‌లో అమ్ముడుపోని జాదవ్.. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్నాడు. అనుకోకుండా ఆర్‌సీబీ నుంచి అతడికి పిలుపు వచ్చింది.


ఆల్‌రౌండర్ అయినా ఐపీఎల్‌లో కేదార్ జాదవ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్‌లో కూడా పెద్ద పర్ఫామెన్స్‌ ఇచ్చింది లేదు. అలాంటి ప్లేయర్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెలక్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఢిల్లీ డేర్‌ డెవిల్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్‌కి కేదార్ జాదవ్ ఆడాడు. 


Also Read: Rashmika Mandanna Favourite Cricketer: అతడి దూకుడు చాలా ఇష్టం.. రష్మిక మందన్న ఫేవరేట్ క్రికెటర్, ఐపీఎల్ టీమ్ ఇదే!  


Also Read: Virat Kohli-Anushka Sharma: నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. విరాట్ కోహ్లీ ట్వీట్‌ వైరల్‌!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.