Nitish Rana appointed as Kolkata Knight Riders New Captain for IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మార్చి 31న ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఇక ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరగనుంది. అయితే ఐపీఎల్‌ 2023కి ముందు కేకేఆర్‌కు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మెగా టోర్నీకి అందుబాటులో ఉండకుండా పోయాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer Injury) గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ ఐపీఎల్‌ 2023కి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయ్యర్ వెన్నునొప్పికి శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు చెప్పారు. ఒకవేళ అతడు సర్జరీ చేయించుకుంటే 5-6 నెలలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. దాంతో ఐపీఎల్ 2023 సహా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 కూడా ఆడటం కుదరదు. అంతేకాదు ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023లో కూడా ఆడటం అసాధ్యమే. 


శ్రేయాస్ అయ్యర్  వెన్ను నొప్పి కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది. కేకేఆర్‌ మేనేజ్మెంట్ తాజాగా ఐపీఎల్ 16వ సీజన్‌కు కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. భారత బ్యాటర్ నితీష్ రాణాకు (Nitish Rana KKR Captain) కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కేకేఆర్‌ కెప్టెన్సీ రేసులో వెస్టిండీస్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్, భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ పేర్లు వినిపించినా.. చివకు రాణా వైపు కేకేఆర్‌ మేనెజ్‌మెంట్‌ మెగ్గు చూపింది. కేకేఆర్‌ ఫ్రాంచైజీ అబుదాబి నైట్‌ రైడర్స్‌ జట్టుకు సారథ్యం వహించిన నరైన్  విఫలమవడంతో అతడికి నిరాశే ఎదురైంది.


నితీష్ రాణా 91 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 28 సగటుతో 2181 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రాణా 15 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే టాప్ ఆర్డర్‌లో ఆడుతున్నప్పటికీ నితీశ్ ఇంకా సెంచరీ సాధించలేకపోయాడు. నితీష్ రాణాకు భారత డొమెస్టిక్ సర్క్యూట్‌లో ఢిల్లీ జట్టుకి నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. 2018 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున రాణా ఆడుతున్నాడు. 


Also Read: Upcoming Electric Cars: విడుదలకు సిద్ధంగా ఉన్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. పూర్తి వివరాలు ఇవే!  


Also Read: Best Mileage Cars 2023: బెస్ట్ మైలేజ్ 7 సీటర్ కార్లు ఇవే.. లీటర్‌పై 26 కిలోమీటర్లు! ధర 6 లక్షల నుంచి స్టార్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.