Virat Kohli and Gautam Gambhir Controversy: విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ ముగిసిన అనంతరం వీరిద్దరు బహిరంగంగా గొడవ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. లక్నో-ఆర్‌సీబీ జట్ల మధ్య మ్యాచ్‌ ముగిసిన అనంతరం వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు ఒకరికొకరు కాసే వాదించుకున్నారు. ఈ ఘటనపై బీసీసీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోహ్లీ, గంభీర్‌లు లెవల్ 2 నేరానికి పాల్పడ్డారని మ్యాచ్‌ ఫీజులో వంద శాతం జరిమానా విధించింది. లక్నో ప్లేయర్ నవీన్-ఉల్-హక్‌కు 50 శాతం ఫైతం పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ ఫీజులో వంద శాతం అంటే.. విరాట్ కోహ్లీ ఏడాదికి రూ..15 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే సగటున 14 మ్యాచ్‌లకు లెక్కెస్తే.. కోహ్లీ మ్యాచ్ ఫీజు రూ.1.07 ఉంటుంది. జట్టు ప్లే ఆఫ్‌, ఫైనల్స్‌కు చేరుకుంటే లెక్కలు వేరుగా ఉంటాయి. గంభీర్‌తో గొడవ కారణంగా ఈ మొతాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అయితే రూ.1.07 విరాట్ కోహ్లీనే బీసీసీఐకి చెల్లిస్తాడా..? అని అభిమానుల్లో అనుమానం ఉంది. 


ఆటగాళ్లు జరిమానాకు గురైతే ఒక్క ఫ్రాంచైజీకి ఒక పద్ధతి ఉంటుంది. విరాట్ కోహ్లీ విషయంలో ఆర్‌సీబీ పూర్తి బాధ్యత తీసుకుంది. మ్యాచ్‌లో గొడవ కారణంగా విరాట్ కోహ్లీకి విధించిన జరినామాను ఆర్‌సీబీ యజమాన్యం చెల్లిస్తుంది. 'జట్టును గెలిపించేందుకు ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డుతారు. జరిమానాల కారణంగా వారు నష్టపోకూడదు. వారి జీతం నుంచి ఒక్క రూపాయి కూడా తగ్గించం. ఫైన్ మొత్తాన్ని మేమే చెల్లిస్తాం..' అని క్రిక్‌బజ్‌తో ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ తెలిపింది.
 
మరోవైపు గౌతమ్ గంభీర్ ఎంత పారితోషికం తీసుకుంటాడో ఇంకా తెలియరాలేదు. ఒక మ్యాచ్ ఫీజుగా రూ.25 లక్షలు ఉంటుందని ఊహాగానాలుగా ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ, మెంటార్ గంభీర్ మధ్య వాణిజ్య ప్రకటనలు వేరు అని సన్నిహితులు చెబుతున్నారు. గంభీర్ ఎంత తీసుకుంటున్నాడో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాకు మాత్రమే తెలుసని అంటున్నారు. గంభీర్‌కు విధించిన జరిమానాను చెల్లించేందుకు లక్నో యజమాన్యం ముందుకు వచ్చింది.


Also Read: Delhi BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..!  


Also Read: SRH vs KKR Dream 11 Team Tips: సొంతగడ్డపై కేకేఆర్‌తో హైదరాబాద్ పోరు.. డ్రీమ్ 11 టిప్స్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook