SRH vs KKR Dream 11 Team Tips: సొంతగడ్డపై కేకేఆర్‌తో హైదరాబాద్ పోరు.. డ్రీమ్ 11 టిప్స్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే..?

Sunrisers Hyderabad Vs Kolkata Knight Riders Dream 11 Prediction: ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ జట్లు నేడు తలపడనున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకమే..  

Written by - Ashok Krindinti | Last Updated : May 4, 2023, 12:02 PM IST
SRH vs KKR Dream 11 Team Tips: సొంతగడ్డపై కేకేఆర్‌తో హైదరాబాద్ పోరు.. డ్రీమ్ 11 టిప్స్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే..?

Sunrisers Hyderabad Vs Kolkata Knight Riders Dream 11 Prediction: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు రెడీ అయింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా 47వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢీకొట్టనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి. కోల్‌కతా ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా.. ఎస్‌ఆర్‌హెచ్ 8 మ్యాచ్‌ల్లో మూడింట గెలుపొందింది. రెండు జట్ల నెట్‌ రన్‌రేట్‌ కూడా దారుణంగా ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. పిచ్ ఎలా ఉండబోతుంది..? ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది..? డ్రీమ్ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..

పిచ్ రిపోర్ట్ ఇలా.. 

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్లకు ఎక్కువగా సహకరిస్తుంది. అయితే బౌలర్లకు కూడా సహకారం అందుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా బౌన్స్ లభించే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తుండడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దీంతో పిచ్‌పై తేమ ఉండడంతో ఫాస్ట్ బౌలర్లు ఈ తేమను బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్‌లో ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లే మెరుగ్గా బౌలింగ్ చేశారు. స్పిన్నర్ల ఎకానమీ రేట్ 7.70 ఉండగా.. ఫాస్ట్ బౌలర్లు 8.18 ఎకానమీతో పరుగులు ఇచ్చారు. గత రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లే ఆధిపత్యం చెలాయించడం విశేషం. 

ఎస్‌ఆర్‌హెచ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో టాపార్డర్ పూర్తిగా తేలిపోతోంది. ఓపెనింగ్ స్లాట్‌లో పదేపదే మార్పులు కూడా దెబ్బ తీస్తోంది. హ్యారీ బ్రూక్‌ను ఓసారి ఓపెనర్‌గా.. మరోసారి మిడిల్ ఆర్డర్‌ పంపిస్తున్నారు. గత మ్యాచ్‌లో బ్రూక్ డకౌట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి కూడా గొప్ప ఫామ్‌లో లేరు. కెప్టెన్ ఐడెన్ మర్‌క్రమ్ కూడా బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉండడం కలిసివస్తోంది. బౌలింగ్‌లో పెద్దగా సమస్యలు లేవు.

అటు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. జట్టుగా ఆడడంలో విఫలమవుతున్నారు. జేసన్ రాయ్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్‌, కెప్టెన్ నితీష్‌ రాణాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఆండ్రీ రస్సెల్‌ బ్యాట్‌తో ఘోరంగా విఫలమవుతున్నాడు. రింకూ సింగ్ ఫినిషర్ రోల్‌ను అద్భుతంగా పోషిస్తున్నాడు. శార్దుల్ ఠాకూర్‌ను బ్యాట్స్‌మెన్‌గా వాడుకుంటోంది. కానీ పెద్దగా ఆడట్లేదు. బౌలింగ్‌ విభాగంలో కోల్‌కతా బలంగానే ఉంది.

తుది జట్లు ఇలా.. (అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, అకిల్ హొస్సేన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ 

కోల్‌కతా నైట్ రైడర్స్‌: జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్.జగదీషన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా 

డ్రీమ్ 11 టీమ్: 

వికెట్ కీపర్: రహ్మానుల్లా గుర్బాజ్, హెన్రిచ్ క్లాసెన్
బ్యాట్స్‌మెన్: వెంకటేష్ అయ్యర్ (వైస్ కెప్టెన్), నితీష్ రాణా, జేసన్ రాయ్, అభిషేక్ శర్మ
ఆల్ రౌండర్లు: ఆండ్రీ రస్సెల్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్) 
బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే

Also Read: KKR Squad Update: కేకేఆర్ జట్టులోకి హార్డ్ హిట్టర్ ఎంట్రీ.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే..!

Also Read: Adhire Abhi : అందుకే జబర్దస్త్ షోలో ఎక్కువ ఇస్తారు.. చైతన్య మాస్టర్ చివరి వీడియోపై అదిరే అభి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News