తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
IPL 2023 SRH VS RR Live Updates: ఐపీఎల్ 2023లో ఆదివారం హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు జట్లు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
SRH VS RR Live Updates Sunrisers Hyderabad vs Rajasthan Royals Scorecard: సొంతగడ్డపై హైదరాబాద్‌కు రాజస్థాన్ జట్టు ఝలక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసిన రాజస్థాన్.. తరువాత బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. హైదరాబాద్‌ను 131 పరుగులకే పరిమితం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (54), జైస్వాల్ (54), సంజూ శాంసన్ (55) రాణించారుర. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4, ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్ల పడగొట్టి హైదరాబాద్ పతనాన్ని శాసించారు.
Latest Updates
తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమిని చవిచూసింది. ఆఖర్లో అబ్దుల్ సమాద్, ఉమ్రాన్ మాలిక్ మెరుపులు మెరిపించి అభిమాలను అలరించారు. రాజస్థాన్ 72 పరుగులతో జయభేరీ మోగించింది.
హైదరాబాద్ 8వ వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ (6)ను చాహల్ ఔట్ చేశాడు. చాహల్‌కు ఇది నాలుగో వికెట్.
17 ఓవర్లు: సన్‌రైజర్స్ హైదరాబాద్ 92/7. క్రీజ్‌లో అబ్దుల్ సమాద్ (15), భువనేశ్వర్ కుమార్ (4) ఉన్నారు
16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 89/7. అబ్దుల్ సమాద్ (13), భువనేశ్వర్ కుమార్ (3) క్రీజ్‌లో ఉన్నారు.
హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఎంత తేడాతో ఓడిపోతుందనేదే తెలియాల్సి ఉంది. స్కోరు బోర్డు: 85-7 (15).
హైదరాబాద్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ (18)ను చాహల్ ఔట్ చేశాడు. హైదరాబాద్ విజయానికి 36 బంతుల్లో 123 రన్స్ కావాలి. 81-7 (14).
రాజస్థాన్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్‌గా నవదీప్ సైనీ బౌలింగ్‌కు వచ్చాడు. 13 ఓవర్‌లో 12 రన్స్ వచ్చాయి. స్కోరు: 75/6 (13).
12 ఓవర్లు: సన్‌రైజర్స్ హైదరాబాద్ 63/6. క్రీజ్‌లో అబ్దుల్ సమాద్ (5), ఆదిల్ రషీద్ (6) ఉన్నారు.
క్రీజ్‌లో పాతుకుపోయిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (27)ను చాహల్ ఔట్ చేశాడు. భారీ షాట్‌కు యత్నించగా.. బౌండరీ లైన్ వద్ద బట్లర్ క్యాచ్ అందుకున్నాడు. స్కోరు బోర్డు: 52-6 (11).
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. ఫిలిప్ (8)ను అశ్విన్ ఔట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అబ్దుల్ సమాద్ బ్యాటింగ్‌కు వచ్చాడు. స్కోరు: 48/5 (10)
9 ఓవర్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ ఓ సిక్సర్ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 8 రన్స్ వచ్చాయి. స్కోరు బోర్డు 46-4.
హైదరాబాద్ 39 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (1)ను జేసన్ హోల్డర్ ఔట్ చేశాడు.
8 ఓవర్లు: సన్‌రైజర్స్ హైదరాబాద్ 38/3. క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్ (23), వాషింగ్టన్ సుందర్ (1) ఉన్నారు.
హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. హ్యారీ బ్రూక్ (13)ను చాహల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 34 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు ఏడు ఓవర్లలో 34-3.
పవర్ ప్లే ముగిసింది. అశ్విన్ వేసిన ఆరో ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. స్కోరు బోర్డు: 30/2 (6).
ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు వేసి కేవలం 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఐదో ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 20 రన్స్ చేసింది ఎస్‌ఆర్‌హెచ్.
రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. నాలుగో ఓవర్‌లో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు బోర్డు: 17/2 (4).
మూడు ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 12 రన్స్ చేసింది. ఈ ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి.
రెండో ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. మయాంక్ అగర్వాల్ (3), హ్యారీ బ్రూక్స్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠి (0)లను డకౌట్ చేశాడు. ఈ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా రాలేదు.
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 రన్స్ చేసింది. ఆఖరి ఓవర్లో ఫరూఖీ 10 పరుగులు ఇచ్చాడు. హెట్‌మేయర్ (22), అశ్విన్ (1) నాటౌట్‌గా నిలిచారు.
19 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
సంజూ శాంసన్ (55) భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద అభిషేక్ హైలెట్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో రాజస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది.
రాజస్థాన్ జోరు తగ్గడం లేదు. 18 ఓవర్లు ముగిసేసరికి 186 రన్స్ చేసింది.
సంజూ శాంసన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 17 ఓవర్లలో రాజస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
రియాన్ పరాగ్ (7) ఔట్ అయ్యాడు. నటరాజన్ బౌలింగ్‌లో ఫరూఖీ క్యాచ్ ఇచ్చాడు.
16 ఓవర్లు: రాజస్థాన్ స్కోర్ 170/3. సంజూ శాంసన్ (49) హాఫ్ సెంచరీకి చేరువగా ఉన్నాడు.
15 ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజ్‌లో సంజూ శాంసన్ (41), రియాన్ పరాగ్ (5) ఉన్నారు. స్కోరు బోర్డు: 160/3 (15).
రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన సూపర్ డెలివరీకి దేవదూత్ పడిక్కల్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రాజస్థాన్ 150 పరుగులు దాటింది. 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది
13 ఓవర్లు: రాజస్థాన్ స్కోర్ 141/2. క్రీజ్‌లో సంజూ శాంసన్ (31), పడిక్కల్ (0) ఉన్నారు.
ఓపెనర్ జైస్వాల్ (37 బంతుల్లో 54, 9 ఫోర్లు) ఫరూఖీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద మయాంక్ అగర్వాల్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు.
మరో ఓపెనర్ జైస్వాల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ 12 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 135 రన్స్ చేసింది.
11 ఓవర్‌లో శాంసన్ ఓ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. స్కోరు బోర్డు: 132/1 (11).
10 ఓవర్లు: రాజస్థాన్ స్కోర్ 122/1. క్రీజ్‌లో జైస్వాల్ (46), సంజూ శాంసన్ (21) ఉన్నారు.
రాజస్థాన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 9 ఓవర్లకు 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో జైస్వాల్ (41), సంజూ శాంసన్ (14) ఉన్నారు.
రాజస్థాన్ స్కోరు 100 పరుగులు దాటింది. 8వ ఓవర్‌లో శాంసన్ రెండు బౌండరీలు బాదాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్‌లో పరుగులు వచ్చాయి. స్కోరు బోర్డు: 105/1 (8).
7 ఓవర్లు: రాజస్థాన్ స్కోర్ 93/1. క్రీజ్‌లో జైస్వాల్ (37), సంజూ శాంసన్ (2) ఉన్నారు.
ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారుతోంది. జోస్ బట్లర్ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో స్టార్ట్ చేశాడు. కేవలం 20 బంతుల్లో ఫిఫ్టీ బాదేశాడు. ఆ తరువాత బౌండరీ బాదగా.. మరుసటి బంతికే ఫరూఖీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బట్లర్ (22 బంతుల్లో 54, ఏడు ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. స్కోరు బోర్డు: 85/1 (6)
ఐదో ఓవర్‌లో బట్లర్ చెలరేగాడు. ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. బట్లర్ (42), జైస్వాల్ (30) జోరుతో రాజస్థాన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.
నాలుగో ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్‌ను రంగంలోకి దింపగా.. బట్లర్ సిక్సర్‌తో స్వాగతి పలికాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. జైస్వాలో ఒక ఫోర్ కొట్టాడు. నాలుగో ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు పిండుకున్నారు. స్కోరు: 56/0 (4)
మూడో ఓవర్లో జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ చెలరేగారు. బట్లర్ ఓ సిక్సర్ బాదగా.. జైస్వాల్ రెండు బౌండరీలు బాదాడు. ఈ ఓవర్‌లో 17 రన్స్ వచ్చాయి. స్కోరు బోర్డు: 37/0 (3).
రాజస్థాన్ ఓపెనర్లు దూకుడు పెంచారు. ఫరూఖీ వేసిన రెండో ఓవర్‌లో రెండు బౌండరీలతో కలిపి మొత్తం 14 పరుగులు వచ్చాయి.
తొలి ఓవర్‌లో రాజస్థాన్ ఆరు పరుగులు చేసింది. జైస్వాల్ ఒక బౌండరీ బాదాడు. ఒక వైడ్, ఒక సింగిల్ రన్ వచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఆరంభించారు. మొదటి ఓవర్‌ను కెప్టెన్ భువనేశ్వర్ వేస్తున్నాడు.
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీకి రెండు జట్ల ఆటగాళ్ల నివాళులు అర్పించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న దురానీ ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మేయర్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), టి.నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట రాజస్థాన్ బ్యాటింగ్ చేయనుంది.
ఉప్పల్ స్టేడియానికి ప్రేక్షకులు భారీగా చేరుకున్నారు. మరికాసేపట్లో టాస్ వేయనున్నారు. మ్యాచ్ ప్రారంభం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.