Mumbai Indians vs Punjab Kings Dream 11 Team Tips: హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ముంబై.. ఆ తరువాత మళ్లీ పుంజుకుంది. వరుసగా మూడు విజయాలతో పటిష్టంగా మారింది. అటు మొదటి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన పంజాబ్.. ఆ తరువాత నాలుగు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లోనే గెలుపొందింది. ముంబై జోరుకు బ్రేక్ వేయాలని పంజాబ్ భావిస్తుండగా.. మరో విక్టరీ సాధించి ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్లాని రోహిత్ సేన చూస్తోంది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ వాంఖడేలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..  


వాంఖడే పిచ్ నుంచి ఎక్కువగా స్పిన్నర్లకు సహకారం అందుతుంది. ఈ పిచ్‌పై ఇప్పటివరకు మొత్తం 32 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. 22 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. ఈ నేపథ్యంలో మరోసారి టాస్ కీరోల్ ప్లే చేసే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో ఇక్కడ ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లు మెరుగ్గా రాణించారు. స్పిన్నర్లు 7.64 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేసి 13 వికెట్లు తీయగా.. ఫాస్ట్ బౌలర్లు 10.17 ఎకానమీతో బౌలింగ్ చేసి 9 వికెట్లు మాత్రమే పడగొట్టారు. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐపీఎల్‌లో ఈ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 15 మ్యాచ్‌లు గెలవగా.. 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. నేడు జరిగే పోరులో ముంబై జట్టు హాట్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. 


కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌ జోడి మంచి ఆరంభాలు ఇస్తుండడంతో మిడిల్ ఆర్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్, కెమెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ ప్లేయర్లు టచ్‌లోకి రావడంతో ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. అయితే బౌలింగ్ ఆ జట్టు కాస్త ఇబ్బంది పడుతోంది. ఫాస్ట్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌ గైర్హాజరీతో కీలక బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. స్పిన్ విభాగంలో పీయూష్ చావ్లా, హృతిక్ షోకీన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రెండోర్ఫ్, రిలే మెరెడిత్ వికెట్లు తీస్తే.. ముంబైకు తిరుగుండదు.  


భుజం గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ దూరమవ్వడం పంజాబ్ కింగ్స్‌ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. శిఖర్ లేకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా తేలిపోతోంది. లియామ్ లివింగ్‌స్టోన్ మినహా పేరున్న బ్యాట్స్‌మెన్లు ఎవరూ లేరు. ప్రభ్‌సిమ్రన్, జితేష్ శర్మ, సికందర్ రజా, షారుక్ ఖాన్ స్థిరంగా రాణించకపోవడంతో జట్టు కష్టాల్లో పడుతోంది. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సామ్ కర్రన్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. బౌలింగ్‌లో హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహర్‌తో పటిష్టంగా ఉంది. 


Also Read: LSG vs GT Dream11 Tips: గుజరాత్ టైటాన్స్‌తో లక్నో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీకోసం..   


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)


ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, బెహ్రెండోర్ఫ్.


పంజాబ్ కింగ్స్: అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ.


డ్రీమ్ 11 టీమ్: (MI vs PBKS Dream 11 Team)


వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్
బ్యాటర్లు: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్)
ఆల్ రౌండర్లు: లియామ్ లివింగ్‌స్టోన్ (కెప్టెన్), సామ్ కుర్రాన్, కామెరూన్ గ్రీన్
బౌలర్లు: పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.


Also Read: Repo Rate 2023: లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో వడ్డీ రేట్లు తగ్గింపు..!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook