Rohit Sharma has the highest number of ducks in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ అన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టుకు హిట్‌మ్యాన్ 5 టైటిల్స్ అందించి ఐపీఎల్ చరిత్రలో రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన బ్యాటింగ్, కెప్టెన్సీ వ్యూహాలతో ముంబైకి ఐపీఎల్ ట్రోఫీలు సాధించిపెట్టాడు. ఐపీఎల్ సారథ్యంతోనే రోహిత్ శర్మకు భారత జట్టు పగ్గాలు దక్కాయి. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ టోర్నీలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్‌కు.. అత్యంత చెత్త రికార్డు కూడా ఉంది. మెగా లీగ్‌లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్ రోహిత్ మాత్రమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ టోర్నీలో ఎక్కువ సార్లు డకౌటైన (IPL Most Ducks) ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ డకౌట్‌ అవ్వడంతో ఈ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ ఐపీఎల్‌లో 16వ సారి డకౌట్‌ అయ్యాడు. దీంతో అత్యధికసార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డు సృష్టించాడు. 2008లో జరిగిన తొలి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న రోహిత్.. ఇప్పటివరకు 16 సార్లు డకౌటయ్యాడు. అత్యధిక పరుగులు, సిక్సులు, సెంచరీల రికార్డులతో పాటు రోహిత్ పేరిట ఈ డకౌట్స్ రికార్డు కూడా ఉండడం విశేషం.


చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌ ముందు వరకు దినేశ్ కార్తిక్‌, మన్‌దీప్‌ సింగ్, సునీల్‌ నరైన్‌తో కలిసి రోహిత్ శర్మ 15 డకౌట్లతో సంయుక్తంగా ఉన్నాడు. చెన్నై మ్యాచ్‌లో రోహిత్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరడంతో.. హిట్‌మ్యాన్ డకౌట్ల సంఖ్య 16కి చేరింది. వీరందరి తర్వాత చెన్నై ఆటగాడు అంబటి రాయుడు 14 డకౌట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్,
పార్థివ్ పటేల్, గ్లెన్ మక్సవెల్, అజింక్య రహానే, మనీష్ పాండే 13 డకౌట్లతో ఉన్నారు. 


ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్స్ లిస్ట్ (Most Ducks in IPL):
రోహిత్ శర్మ - 16
దినేశ్ కార్తిక్‌ - 15
మన్‌దీప్‌ సింగ్ - 15
సునీల్‌ నరైన్ - 15
అంబటి రాయుడు - 14
పియూష్ చావ్లా - 13
హర్భజన్ సింగ్ - 13
పార్థివ్ పటేల్ -13
గ్లెన్ మక్సవెల్ - 13
అజింక్య రహానే - 13
మనీష్ పాండే - 13