MS Dhoni`s Tweet on Jadeja: పదేళ్ల క్రితం జడేజా ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్
MS Dhoni`s Tweet on Jadeja: ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగానే వివాదాలకు దూరంగా ఉండే ధోనీ ఎవరి గురించి అయినా, ఏదైనా సరదాగా కామెంట్ చేశాడంటే.. అందులోనూ ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉండకుండా పోదు. సరిగ్గా అలాగే పదేళ్ల క్రితం రవింద్ర జడేజా గురించి ధోనీ సరదాగా చేసిన ట్వీట్ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో తెలియదు కానీ తాజాగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్ అనంతరం ఆ ట్వీట్ ఐపిఎల్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
MS Dhoni's Tweet on Jadeja: పదేళ్ల క్రితం జడేజా ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా శనివారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపిఎల్ 2023 మ్యాచ్ లో రవీంద్ర జడేజా పట్టిన ఒక క్యాచ్ అందుకు కారణమైంది. నిన్న రవింద్ర జడేజా పట్టిన క్యాచ్ కి, పదేళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ట్వీట్ కి ఏంటి సంబంధం ? ఆ ట్వీట్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది అనే కదా మీ సందేహం .!! మరేం లేదు.. అప్పుడు ధోనీ చేసిన ట్వీట్ కూడా జడేజా ఫీల్డింగ్ స్కిల్స్ గురించే. మరీ ముఖ్యంగా జడేజా క్యాచ్ ల కోసం బాల్స్ వెంట పరుగెత్తడని.. బంతులే అతడిని వెదుక్కుంటూ వచ్చి చేతుల్లో వాలిపోతాయని ధోనీ పదేళ్ల క్రితమే ట్వీట్ చేశాడు.
మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ట్వీట్‌కి తగినట్టుగానే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. కామెరాన్ గ్రీన్ ప్యాకింగ్ బలంగా కొట్టిన షాట్ కి బంతి బౌండరీకి వెళ్లడం ఖాయం అనే అందరూ అనుకున్నారు. కానీ కామెరూన్ బ్యాడ్ లక్.. అది కాస్తా దారిమధ్యలోనే నేరుగా వెళ్లి జడేజా చేతికి చిక్కింది.
క్రికెట్ ప్రియులకు జ్ఞాపక శక్తి కూడా పెద్దదే కదా.. అందుకే జడేజా పట్టిన ఈ క్యాచ్ చూశాకా సరిగ్గా పదేళ్ల క్రితం ధోనీ చేసిన ట్వీట్ వారికి గుర్తుకొచ్చింది. అప్పట్లోనే జడేజా ఫీల్డింగ్ స్కిల్స్‌ను ప్రశంసిస్తూ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ట్వీట్ ని రిట్వీట్ చేసిన నెటిజెన్స్.. ధోనీ ముందే ఈ విషయాన్ని పసిగట్టాడు అంటూ మరోసారి వైరల్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Fastest 50 in IPL 2023: ఐపిఎల్ 2023లో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ అజింక్య రహానేదే.. ఎన్ని బంతుల్లోనో తెలుసా ?
ఇక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ సేన ఏడు వికెట్ల తేడాతో గెలిచి సూపర్ అనిపించుకుంది. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రవింద్ర జడేజా.. కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. జడేజా అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌కి గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.
ఇది కూడా చదవండి : David Warner Not Out: యశస్వి జైశ్వాల్ క్యాచ్ పట్టినా.. డేవిడ్ వార్నర్‌కి ఔట్ ఇవ్వలేదు ఎందుకో తెలుసా ?
ఇది కూడా చదవండి : Sanju Samson Stunning Catch: సింగిల్ హ్యాండ్‌తో సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK