MS Dhoni Injury: ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం.. క్లారిటీ ఇచ్చిన సీఎస్‌కే సీఈవో!
MS Dhoni Is 100 Percent Playing Gujarat Titans Match says Chennai Super Kings CEO. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
CSK CEO Says MS Dhoni to play IPL 2023 First Match vs GT: క్రికెట్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నేటి సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు ఉంటాయి. ఈ వేడుకల్లో స్టార్ హీరోయిన్స్ రష్మిక మంధాన, తమన్నా భాటియా డాన్స్ చేయనున్నారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయనున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ సీజన్ మొదటి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు విజయం నమోదు చేయాలని చూస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ స్వల్ప గాయం (MS Dhoni Injury) బారిన పడినట్లు సమాచారం తెలుస్తోంది. ఎడమ మోకాలి గాయంతో మహీ బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సమయంలో కూడా ధోనీ మైదానంలో కుంటుకుంటూ నడవడం ఫాన్స్ కంటపడింది. ఇందుకుసంబందించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ధోనీ నేటి మ్యాచ్ ఆడటం లేదనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి.
మోకాలి నొప్పితో (MS Dhoni Injury Update) బాధపడుతున్న 41 ఏళ్ల ఎంఎస్ ధోనీ అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకని నేటి మ్యాచ్ ఆడొద్దని నిర్ణయం తీసుకున్నాడని నెట్టింట వార్తలు వినిపించాయి. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉందని కూడా న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో సీఎస్‌కే ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ ధోనీ ఆడతాడనే భరోసా ఇచ్చారు. ధోనీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, నూటికి నూరు శాతం నేటి తొలి మ్యాచ్ ఆడతాడని చెప్పారు.
డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం దాదాపు ఖాయం. అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, శివమ్ దూబే మిడిలార్డర్‌లో ఆడతారు. పేసర్ ముకేశ్ చౌదరి గాయం కారణంగా టోర్నీనుంచి వైదొలిగగా.. దీపక్ చహర్ రాకతో చెన్నై బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారనుంది. సిమర్‌జీత్ సింగ్, మహీశ్ తీక్షణ అతడికి సహకారం అందించనున్నారు.
Also Read: Hero New Splendor 2023: హీరో సరికొత్త స్ల్పెండర్.. ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది! ధర కేవలం 83 వేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.