MS Dhoni Interview: ఆ ఇద్దరు మరికాసేపు క్రీజ్‌లో ఉండుంటే.. మ్యాచ్ 18 ఓవర్లలోనే ముగిసేది: ఎంఎస్ ధోనీ
RCB vs CSK IPL 2023 Match 24: MS Dhoni react on CSK win vs RCB. ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ మరికాసేపు క్రీజ్‌లో ఉండుంటే మ్యాచ్ 18 ఓవర్లలోనే ముగిసేది అని అన్నాడు.
If Faf du Plessis and Glenn Maxwell had continued RCB won by 18th over Says MS Dhoni: సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (83; 45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ దూబే (52; 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. లక్ష ఛేదనలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమైంది. ఫాఫ్ డుప్లెసిస్ (62; 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76; 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగారు. బెంగళూరు మొదటి నుంచి రేసులో ఉన్నా.. చివరికి సీఎస్‌కేనే విజయం వరించింది.
భారీ లక్ష్య ఛేదనలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపిస్తూ సీఎస్‌కేకు ముచ్చెమటలు పట్టించారు. ఈ ఇద్దరు భారీ షాట్లు ఆడేయడంతో ఓ దశలో చెన్నై ఓటమి ఖాయం అనిపించింది. అయితే కీలక సమయంలో సీఎస్‌కే బౌలర్లు విజృంభించి.. ఫాఫ్, మ్యాక్సీని ఔట్ చేశారు. దీంతో చెన్నై రేసులోకి వచ్చి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫాఫ్, మాక్సీ కలిసి 12 సిక్స్‌లు, 8 ఫోర్లు బాదారు అంటే ఎంతలా పరుగుల ప్రవాహం పారిందో అర్ధం చేసుకోవచ్చు.
మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ మరికాసేపు క్రీజ్‌లో ఉండుంటే మ్యాచ్ 18 ఓవర్లలోనే ముగిసేది అని అన్నాడు. 'డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కుర్రాళ్లకు పెద్ద సవాల్. మా కుర్రాళ్లు బాగా బౌలింగ్ చేశారు. చెన్నై బౌలర్లు చాలా కష్టపడుతున్నారు. డ్వేన్ బ్రావో మార్గదర్శకంలో రాటుదేలుతున్నారు. ఆత్మవిశ్వాసంతో బంతులను సంధిస్తున్నారు. కోచ్, బౌలింగ్ కోచ్, సీనియర ఆటగాళ్లు వారికి అండగా నిలవాలి. అప్పుడే మరింత బాగా ఆడుతారు' అని ఎంఎస్ ధోనీ అన్నాడు.
'యువ బ్యాటర్ శివమ్ దూబే బాగా హిట్టింగ్ చేశాడు. స్పిన్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతున్నాడు. అయితే ఫాస్ట్ బౌలర్లతో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అందులోనూ మరుగుపడితే కీలక ఆటగాడిగా మారతాడు. డేవన్ కాన్వే, శివమ్ దూబే ఇన్నింగ్స్‌లతో బెంగళూరు ముందు భారీ స్కోరు ఉంచాం. ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ ధాటిగా ఆడి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చారు. వీరిద్దరూ మరికాసేపు క్రీజ్‌లో కొనసాగి ఉంటే మ్యాచ్ 18 ఓవర్‌లోనే ముగిసేది. వికెట్ల వెనుక ఉండి ఇద్దరి ఆటను గమనిస్తూనే ఉన్నా. ఫలితం కన్నా.. వారిని అడ్డుకోవడంపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. విజయం దక్కినందుకు ఆనందంగా ఉంది' అని చెన్నై కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.