CSK Head Coach Stephen Fleming react on Captain MS Dhoni Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. కనీసం ఐపీఎల్‌లో అయినా ధోనీ ఆట చూసి ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే అభిమానులను ఓ వార్త నిరాశకు గురిచేస్తోంది. 16వ సీజన్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఐపీఎల్‌కూ గుడ్‌బై చెపుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు స్పందించారు. సీఎస్‌కే మాజీ ఆటగాడు కేదార్‌ జాదవ్‌, చెన్నై స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ స్పందించాడు. తాజాగా సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రియాక్ట్ అయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం పంజాబ్‌ కింగ్స్ చేతిలో చివరి బంతికి చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఎంఎస్ ధోనీ ఎప్పుడూ రిటైర్‌మెంట్‌పై (MS Dhoni IPL Retirement) ప్రత్యేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశాడు. 'ఐపీఎల్ 2023 సీజనే తనకు చివరిదని చెన్నై సారథి ఎంఎస్ ధోనీ ఎప్పుడూ చెప్పలేదు. మహీకి ఆ ఆలోచన కూడా ప్రస్తుతానికి అయితే లేదు. అతడి లక్ష్యం ఒక్కటే. ఈ సీజన్‌లో చెన్నైని ఛాంపియన్‌గా నిలపనుకుంటున్నాడు. అందరం దానిపైనే దృష్టిసారించాం' అని ఫ్లెమింగ్‌ చెప్పాడు.


కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'నా ఐపీఎల్‌ కెరీర్‌ చివరి దశలో ఉంది. ఇక్కడకు వచ్చిన వారంతా నాకు వీడ్కోలు పలికేందుకు వచ్చినట్లు ఉంది' అని అన్నాడు. దాంతో సోషల్ మీడియాలో ధోనీ రిటైర్మెంట్ వార్తలు ఎక్కువయ్యాయి. గత సీజన్‌లోనూ ధోనీ ఆడటంపై సందేహాలు వచ్చాయి. వాటన్నింటినీ కొట్టిపడేస్తూ ఐపీఎల్ 2023నూ సీఎస్‌కేను నడిపిస్తున్నాడు. అయితే ధోనీ తన హోం గ్రౌండ్‌లోనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతానని గతంలో ప్రకటించాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫాన్స్ మాత్రం మరో 2-3 ఏళ్లు ఆడాలని కోరుకుంటున్నారు. 


ఐపీఎల్‌ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంది. కెప్టెన్ కూల్‌ ఎంఎస్ ధోనీ సారద్యంలో చెన్నై ముందుకు సాగుతోంది. ప్రస్తుత సీజన్‌లోనే ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతూనే జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను అందించి ముంబైతో సమంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా సీఎస్‌కేను నిలబెట్టాలని చూస్తున్నాడు. ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో చెన్నై ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. చెన్నై ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. మరో మూడు మ్యాచులు గెలిస్తే ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. 


Also Read: Kedar Jadhav RCB: బెంగళూరుకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్! చెన్నై ప్లేయర్ ఇన్


Also Read: Rashmika Mandanna Favourite Cricketer: అతడి దూకుడు చాలా ఇష్టం.. రష్మిక మందన్న ఫేవరేట్ క్రికెటర్, ఐపీఎల్ టీమ్ ఇదే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.