Wasim Akram Answer on What if MS Dhoni Was RCB Captain: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌లు. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి రోహిత్ ఐదు టైటిల్స్ అందించగా.. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీకి ధోనీ నాలుగు ట్రోఫీలు అందించాడు. అయితే బిగ్ స్టార్లతో కూడిన రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రాంచైజీ మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్‌ చేరినప్పటికీ.. టైటిల్‌ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. ఐపీఎల్ ఆరంభం నుంచి పోటీపడుతున్నప్పటికీ టైటిల్ మాత్రం అందని ద్రాక్ష లానే మిగిలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 2009లో అనిల్ కుంబ్లే, 2011లో డానియల్‌ వెటోరీ, 2016లో విరాట్ కోహ్లీ సారథ్యంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. ప్రస్తుత సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌ రేసులో  బెంగళూరు ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడి 5 విజయాలతో 10 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. ఈ క్రమంలో బెంగళూరు టైటిల్‌ను గెలవలేకపోవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించి ఉంటే ఆర్‌సీబీ ఖాతాలో మూడు టైటిల్స్ ఉండేవన్నాడు. 


తాజాగా వసీమ్ అక్రమ్‌ మాట్లాడుతూ... 'రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా మూడు ఐపీఎల్‌ టైటిళ్లను గెలిచేది. అయితే ఎంఎస్ ధోనీ ఆ జట్టుకి కెప్టెన్‌గా ఉండి ఉంటేనే సాధ్యమయ్యేది. ఇప్పటివరకు బెంగళూరు ఒక్క టైటిల్ గెలవలేకపోయింది. అయినా అభిమానుల నుంచి భారీగా మద్దతు ఉంది. టాప్ ప్లేయర్లు ఆర్‌సీబీ సొంతం. విరాట్ కోహ్లీ వంటి స్టార్‌ ప్లేయర్‌ ఉన్నా.. దురదృష్టవశాత్తూ విజేతగా నిలవలేకపోతోంది. అదే ఎంఎస్ ధోనీ ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉండుంటే.. ఆ మూడు టైటిళ్లను గెలిచేది. జట్టుకు కెప్టెన్‌గా ఉండటం ధోనీకి అలవాటు అయింది కోహ్లీ కూడా అలానే ఉన్నా.. ధోనీ మాయ ప్రత్యేకమైనది. మహీ మనసులో మ్యాచ్‌కు సంబంధించిన ప్రణాళికలు మెదులుతోనే ఉంటాయి. బయటకు కామ్‌గా కనిపించినా.. లోపల మాత్రం ప్లానింగ్‌ జరుగుతూనే ఉంటాయి. కోహ్లీ కూడా తన ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటాడు. ధోనీ నిశ్శబ్దంగా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు' అని అన్నాడు. 


ఓ ఇంటర్వ్యూలో వసీమ్ అక్రమ్‌కి వింత ప్రశ్న ఎదురైంది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీకి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీ ఇచ్చి ఉంటే ఏమైఉండేదని అడిగారు. ఆ ప్రశ్న అడగ్గానే బెంగళూరు కచ్చితంగా మూడు ట్రోఫీలు గెలిచి ఉండేదని సమాధానం చెప్పాడు. అంతేకాకుండా పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌ పై వివరణ ఇచ్చాడు. వసీమ్ సమాధానం చూసిన చెన్నై ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. 


Also  Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. టాప్ రికార్డ్స్ ఇవే!  


Also Read: Sandeep Sharma No-Ball: నో బాల్‌ గురించి ఆలోచించడం లేదు.. సందీప్ శర్మకు అన్ని తెలుసు: సంజూ శాంసన్‌  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.