PBKS vs LSG: లక్నోదే బ్యాటింగ్.. గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్! తుది జట్లు ఇవే
Punjab Kings vs Lucknow Super Giants Playing 11 Out. ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలి వేదికగా మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడునున్నాయి.
PBKS vs LSG IPL 2023 Match No 38 Live Updates: ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలి వేదికగా మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడునున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ మూడు మార్పులు చేసింది. బౌలర్ గుర్నూర్ సింగ్ బ్రార్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. కగిసో రబాడ నుంచి క్యాప్‌ను అందుకోవడం విశేషం. గాయం కారణంగా ఆడని గబ్బర్ సింగ్ బ్యాక్ అయ్యాడు.
16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఆ మ్యాచ్‌లో లక్నోను పంజాబ్ రెండు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దీంతో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పుడు లక్నో భావిస్తోంది. ఇక ఐపీఎల్ 2023లో ఇరు జట్లు చెరో 7 మ్యాచులు ఆడి 4 విజయాలతో 8 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాయి. ఈ మ్యాచులో గెలిచిన టీమ్ పది పాయింట్లతో పట్టికలో ముందుకు దూసుకెళుతుంది. దాంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: అథర్వ తైడే, శిఖర్ ధావన్ (కెప్టెన్), సికిందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చహర్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కేల్ మయేర్స్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, మార్నస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోనీ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, నవీనుల్ హక్.
సబ్‌స్టిట్యూట్‌లు:
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, మోహిత్ రాథీ, రిషి ధావన్, మ్యాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ బ్రార్.
లక్నో: కృష్ణప్ప గౌతమ్, డానియల్ సామ్స్, ప్రేరక్ మన్కడ్, అమిత్ మిశ్రా, మార్క్ వుడ్.
Also Read: Shani Gochar 2023: ఈ 5 రాశుల వారికి వచ్చే 25 నెలలు అదృష్టమే.. ప్రతి పనిలో విజయం! ధనవంతులు అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.