PBKS VS RCB: బెంగళూరుదే బ్యాటింగ్.. రెండు జట్లకు కొత్త కెప్టెన్లు! తుది జట్లు ఇవే
Punjab Kings vs Royal Challengers Bangalore IPL 2023 27th Match Playing 11. ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా మరికొద్దిసేపట్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు జరుగనుంది.
PBKS VS RCB IPL 2023 Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా మరికొద్దిసేపట్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు జరుగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో ఇరు జట్లకు కొత్త కెప్టెన్లు ఉన్నారు. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తుది జట్టులో ఉన్నా.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ సారధ్య బాధ్యతలు అందుకున్నాడు. మరోవైపు పంజాబ్ సారథి శిఖర్ ధావన్ గాయంతో ఈ మ్యాచ్ ఆడడం లేదు.
16వ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దాంతో బెంగళూరుకి ఈ మ్యాచ్ కీలకం కానుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచులో మాత్రం బెంగళూరు ఫేవరేట్ జట్టుగా ఉంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
తుది జట్లు:
పంజాబ్: అథర్వ తైడే, మ్యాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్ (కెప్టెన్), జితేశ్ శర్మ (కీపర్), షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లామ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షహ్‌బాజ్ అహ్మద్, వహిందు హసరంగ, సుయాశ్ ప్రభుదేశాయ్, హర్షల్ పటేల్, వ్యాన్ పార్నెల్, మొహ్మద్ సిరాజ్.
సబ్‌స్టిట్యూట్‌లు:
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, సికిందర్ రజా, మోహిత్ రాతీ, రిషి ధావన్, శివమ్ సింగ్.
బెంగళూరు: వైశాక్ విజయ్ కుమార్, డేవిడ్ విల్లే, ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్.
Also Read: KL Rahul Interview: నా కెప్టెన్సీ వారికి నచ్చలేదేమో.. అందుకే బంతితో కొట్టారు: కేఎల్ రాహుల్
Also Read: DC vs KKR Dream11 Team: ఢిల్లీ vs కోల్‌కతా డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.