Rashid Khan Hat-trick Wickets Video: ఐపిఎల్ 2023లో ఫస్ట్ హ్యాట్రిక్.. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వీడియో వైరల్
GT vs KKR Match of IPL 2023: ఐపిఎల్ 2023 లో టోర్నీలో భాగంగా గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ వికెట్స్ తీసి తన బౌలింగ్‌తో అదరగొట్టాడు.
GT vs KKR Match of IPL 2023: గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో గుజరాత్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అదరగొట్టాడు. ఐపిఎల్ 2023 సీజన్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ వికెట్స్ తీసి ఆ ఘనతను తన పేరిట సొంతం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్.. వరుసగా ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్థూల్ థాకూర్‌ల వికెట్స్ పడగొట్టాడు. రషీద్ ఖాన్ ఓవర్ ప్రారంభించడానికి ముందు వరకు పూర్తి నియంత్రణలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును రషీద్ ఖాన్ పట్టు కోల్పోయేలా చేశాడు.
ఆండ్రూ రస్సెల్ వికెట్‌తో మొదలైన పతనం..
16.1 ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన బంతిని రస్సెల్ హిట్ ఇవ్వగా.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ శ్రీకర్ భరత్ క్యాచ్ పట్టడంతో వికెట్ల పతనం మొదలైంది. ఆ తరువాతి బంతికి సునీల్ నరైన్ వికెట్ తీశాడు. రషీద్ విసిరిన బంతిని హిట్ ఇవ్వబోయిన సునీల్ నరైన్.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జయంత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. రషీద్ ఖాన్ దూకుడు కారణంగా నరైన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇదే వరుసలో రషీద్ ఖాన్ పడగొట్టిన మూడో వికెట్ శార్దూల్ ఠాకూర్.
రషీద్ ఖాన్ 17వ ఓవర్ 3వ బంతికి మరో గూగ్లీ వేసి ఈసారి శార్థూల్ థాకూర్ వికెట్‌ను తీసుకున్నాడు. ఈసారి శార్థూల్ థాకూర్ ఎల్బీడబ్లూ అయ్యాడు. క్రితం మ్యాచ్‌లో చెలరేగిపోయిన శార్థూల్ థాకూర్ కూడా ఔట్ అవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. ఎంపైర్ నిర్ణయాన్ని రివ్యూ చేయాలనుకోగా.. రీప్లేలో బంతి స్టంప్స్ పైకే దూసుకెళ్లినట్టు కనిపించింది. అలా రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును చివర్లో కోలుకోకుండా చేశాడు. అయితే చివర్లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ అనూహ్యంగా చెలరేగిపోయాడు.
ఇది కూడా చదవండి: Who is Rinku Singh: వరుసగా 5 సిక్సులు కొట్టిన రింకూ సింగ్ ఎవరో తెలుసా ?
కోల్‌కతా నైట్ రైడర్స్ విజయానికి చివరి 5 బంతుల్లో 28 పరుగులు అవసరం అయ్యాయి. అయితే, రషీద్ ఖాన్ తీసిన హ్యాట్రిక్ వికెట్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ నడ్డి విరిచాడు కనుక ఇక గుజరాత్ టైటాన్స్‌దే విజయం అని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రింకూ సింగ్ సిక్సుల మీద సిక్సులు బాదడం మొదలుపెట్టాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు బంతులకు ఐదు సిక్సులు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇది రింకూ సింగ్ అందించిన ఊహించని విజయం. రింకూ సింగ్ సాధించిన ఈ అరుదైన ఫీట్‌తో అతడి జట్టు గెలవగా.. గుజరాత్ టైటాన్స్ తరపున పోరాడిన రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్స్ వృథా అయ్యాయి.
ఇది కూడా చదవండి: MS Dhoni's Tweet on Jadeja: పదేళ్ల క్రితం జడేజా ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK