Who is Rinku Singh: వరుసగా 5 సిక్సులు కొట్టిన రింకూ సింగ్ ఎవరో తెలుసా ?

Who is Rinku Singh, Rinku Singh Biography: రింకూ సింగ్.. చివరి ఐదు బంతుల్లో 6 సిక్సులు కొట్టి జట్టును గెలిపించిన ధీరుడు. ప్రస్తుతం ఐపిఎల్ 2023 క్రీడా ప్రపంచంలో మార్మోగిపోతున్న పేరు ఇది. కేవలం రూ. 80 లక్షల ఆటగాడు. కానీ జట్టుని గెలిపించి కోట్లు పెట్టి కొన్న వాళ్ల కన్నా ఎక్కువ విలువ చేశాడు. ఇంతకీ ఎవరు ఈ రింకూ సింగ్ ? ఎందుకు అతడికి అంత పాపులారిటీ వచ్చిందో తెలుసుకుందాం రండి. 

Written by - Pavan | Last Updated : Apr 10, 2023, 08:55 AM IST
Who is Rinku Singh: వరుసగా 5 సిక్సులు కొట్టిన రింకూ సింగ్ ఎవరో తెలుసా ?

Who is Rinku Singh, Rinku Singh Biography: క్రికెట్‌లో కొంతమంది బ్యాట్స్‌మెన్‌ ఒకే ఓవర్‌లో వరుసగా ప్రతీ బంతిని సిక్సర్ కొట్టడం చూశాం. అంటే ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టడం అన్నమాట. రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హర్షల్ గిబ్స్ వంటి ఆటగాళ్లు ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కానీ భారీ స్కోరును ఛేదించే క్రమంలో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టడం అనేది మాత్రం చాలా అరుదైన విషయం. 2016 లో కార్లోస్ బ్రాత్‌వైట్ ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ తెవాటియా ఐపిఎల్ 2020లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ కింగ్స్ పై ఆ ఘనత సాధించాడు. తాజాగా 2023లో మన ఇండియా నుంచే మరొక బ్యాట్స్‌మన్ ఆ జాబితాలో చేరాడు. 

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ గుజరాత్ జెయింట్స్ బౌలర్ యష్ దయాల్‌ బౌలింగ్ లో ఐదు సిక్సర్లు కొట్టి ఐపిఎల్ 2023 లో ఇదే అద్భుతమైన మ్యాచ్ అనిపించాడు. ఐపిఎల్ 2023 లోనే కాదు.. దాదాపు ఐపిఎల్ చరిత్రలోనే ఇలాంటి మ్యాచ్ మరొకటి ఉండదేమో అనేలా చేశాడు. చివరి ఓవర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయానికి 29 పరుగులు అవసరం అయ్యాయి. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తోన్న రింకూ చివరి 5 బంతులను సిక్సర్లు కొట్టి ఆ జట్టును గెలిపించిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. కేవలం 21 బంతుల్లోనే 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇంతకీ ఈ రింకూ సింగ్ ఎవరో తెలుసా ?
రింకూ సింగ్ తండ్రి ఎల్‌పిజి సిలిండర్‌లను హోమ్ డెలివరీ చేసే పనిచేస్తుండగా, అతని అన్నయ్య ఆటో రిక్షా నడుపుకుంటున్నాడు. వీళ్ల ఇంట్లోనే మరొకరు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్నారు. రింకూ తొమ్మిదో తరగతిలో ఫెయిలై అంతటితోనే చదువు ఆపేశాడు. క్రికెట్ అంటే రింకూకి ప్రాణం. అతడి ధ్యాస అంతా క్రికెట్ పైనే. కానీ ఆర్థికంగా వెనుకబడిన రింకూ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. క్రికెట్ నుండి సంపాదించినదంతా ఇంట్లో అప్పులు కట్టడానికి కూడా సరిపోయేది కాదు. దాంతో ఒకానొక దశలో రింకూ తన క్రికెట్ కలను వదులుకోవాలని భావించాడు. 

ఉద్యోగం వెదికిపెట్టమని తన సోదరుడి సహాయం కోరగా... చివరకు అతనికి దొరికిన పని ఒక ఇంట్లో పని మనిషిగా చేసే పని. అయితే, ఎలాగైనా సరే క్రికెట్‌లోనే నిలదొక్కుకోవాలని ధృడంగా నిర్ణయించుకున్న రింకూ ఆ పనిని వదిలేశాడు. 2018లో జరిగిన IPL వేలంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 80 లక్షలకు బిడ్డింగ్ లో అతడిని సొంతం చేసుకుంది.

" మహా అయితే, నా రేటు 20 లక్షలు పలుకుతుంది అని అనుకున్నాను. కానీ ఊహించని విధంగా నన్ను 80 లక్షల రూపాయలకి తీసుకున్నారు. మా అన్నయ్య పెళ్లికి నేనూ డబ్బివ్వగలనని.. అలాగే సోదరి పెళ్లికి కూడా కొంత పొదుపు చేయాలని అనుకున్నాను. మరొక మంచి ఇల్లు చూసుకుని అందులోకి మారాలని ఆలోచించాను" అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ తన గత జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : Rashid Khan Hat-trick Wickets Video: ఐపిఎల్ 2023లో ఫస్ట్ హ్యాట్రిక్.. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వీడియో వైరల్

రింకూ సింగ్ క్రికెటర్ గా ఎలా ఎదిగాడంటే..
2013లో రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్ అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తరువాత, రింకూ పర్ ఫార్మెన్స్ తో బ్యాట్స్‌మెన్‌గా రానించడంతో అండర్-19 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. 2013లో, రింకు సింగ్ ముంబై ఇండియన్స్ నిర్వహించిన క్యాంప్‌లో పాల్గొని కేవలం 31 బంతుల్లోనే 95 పరుగులు రాబట్టి శభాష్ అనిపించుకున్నాడు. 2018లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో, రింకూ సింగ్ 44 బంతుల్లో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

ఇది కూడా చదవండి : MS Dhoni's Tweet on Jadeja: పదేళ్ల క్రితం జడేజా ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News