Virat Kohli: నేను బౌలింగ్ చేసుంటే రాజస్తాన్ 40 పరుగులకే ఆలౌటయ్యేది.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Virat Kohli reacts after RCB beat RR for 59 runs in IPL 2023. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Virat Kohli reacts after RCB beat RR for 59 runs in IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం (మే 14) జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 పరగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 72 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు పెవిలియన్ చేరుతుండడంతో రాజస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. రాజస్థాన్ జట్టు ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బెంగళూరు ప్రాంచైజీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అయితే ఈ వీడియోలో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్‌గా మారాయి. తాను బౌలింగ్ చేసుంటే రాజస్తాన్‌ను 40 పరుగులకే ఆలౌట్ చేసేవాడిని అని సరదాగా అన్నాడు.
'నేను బౌలింగ్ చేసుంటే.. రాజస్తాన్ రాయల్స్ కేవలం 40 పరుగులకే ఆలౌటయ్యేది' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేన్ పార్నెల్ మాట్లాడుతూ ఇదొక అద్భుత మ్యాచ్ అని, వికెట్స్ తీయడం సంతోషంగా ఉందన్నాడు. మొహ్మద్ సిరాజ్, మైఖేల్ బ్రేస్‌వెల్ మరియు అనూజ్ రావత్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉన్నది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తదుపరి మ్యాచ్ మే 18న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఫాఫ్ సేన విజయం సాధిస్తే ప్లే ఆప్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే 14 పాయింట్లతో ఇతర జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది.
Also Read: IPL 2023 Playoffs Race: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్.. మిగతా మూడు జట్లు ఇవేనా!
Also Read: సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం.. Nveda Joint Support పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.