సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం.. Nveda Joint Support పూర్తి వివరాలు ఇవే!

Nveda Joint Support for Knee and Joint Pains Relief. కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యానికి హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ద్వారా పొందే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.   

Written by - P Sampath Kumar | Last Updated : May 15, 2023, 08:13 PM IST
సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం.. Nveda Joint Support పూర్తి వివరాలు ఇవే!

Natural Remedy for Knee and Joint Pains Relief with Nveda Joint Support: 'హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2' అనేది ఒక రకమైన కొలాజెన్ (ప్రోటీన్ పదార్థం). ఇది కీళ్లు మరియు మోకాళ్ల నొప్పుల తగ్గుదల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది. ఎందుకంటే ఇది కీళ్ల మృదులాస్థి యొక్క ప్రధాన నిర్మాణ భాగం. దీన్ని కోడి యొక్క మృదులాస్థి నుంచి తీసుకోబడింది. కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యానికి హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ద్వారా పొందే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ప్రయోజనాలు:
1. కీళ్ల చలనాన్ని మెరుగుపరుస్తుంది: 
హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 కీళ్ల చలనాన్ని మరియు వంగే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు మరియు అన్ని రకాల కీళ్ల వాపు వ్యాధులు (ఆర్థరైటిస్), కీళ్ల కదలికలో కష్టం (రుమాటిక్) మరియు ముసలితనపు కీళ్ల వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్‌)తో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

2. కీళ్లు & మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది:
 హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వలన ముసలితనపు కీళ్ల వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నటువంటి వారిలో కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

3. మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: 
కొలాజెన్ టైప్-2 మృదులాస్థిలో ప్రధాన భాగం. అది కీళ్లలో ఉన్న ఎముకల మధ్య ఒక మెత్తని పదార్థం లాగా పని చేస్తుంది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థి ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాదు అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. ఇది క్రీడల్లో గాయపడిన వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4. కీళ్లు, మోకాళ్ల కణజాలను బాగుచేయడంలో దోహదపడుతుంది:
 కీళ్లు మరియు మోకాళ్ల కణజాలను బాగుపరచడంలో కొలాజెన్ టైప్-2 ఎంతో ముఖ్యమైనది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల కొత్తగా కీళ్ల కణజాల పెరుగుదలకు దోహదపడుతుంది. కీళ్ల మరియు మోకాళ్ల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

5. సురక్షితమైనది మరియు సహజసిద్ధమైనది: 
హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 చాలా మంది ఒంటికి తగినటువంటి సురక్షితమైన, సహజసిద్ధమైన పదార్థం. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది. అంతేకాదు దీనిని శరీరం బాగా గ్రహించుకుంటుంది. పై ప్రయోజనాల కారణంగా కీళ్ల నొప్పులు మరియు బిగుసుకుపోయిన కీళ్లు ఉన్న వారికి ఇదొక ప్రభావవంతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

Nveda (https://nveda.in/) అనేది బాగా పరిశోధించబడిన పదార్థాలతో కూడిన 'Nveda Joint Support' అనే ఒక ఉత్పత్తిని తయారు చేసింది. ఇవన్నీ కూడా మోకాళ్లు, కీళ్లను బలపరచడంలో సహాయపడతాయి. Nveda Joint Supportలో హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో పాటు గ్లూకోసమైన్, ఎంఎస్ఎం, కాల్షియం సిట్రేట్ మరియు కాల్షియం ఆస్కార్బేట్‌లు కూడా ఉన్నాయి. ఈ సహజసిద్ద పదార్ధాలన్నీ మంటను తగ్గించడానికి, కీళ్ల రాపిడిని తగ్గించడానికి మరియు కీళ్లు అండ్ మృదులాస్థిని బలపరచడంలో సహాయపడతాయి. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు (https://nveda.in/products/joint-support-60).

గ్లూకోసమైన్ అనేది సహజసిద్దంగా మన శరీరంలో ఉండే పదార్థం. ఇది మృదులాస్థి తయారీలో, దానిని బాగు చేయడంలో దోహదపడుతుంది. ఇది సాధారణంగా మోకాళ్లు మరియు కీళ్ల ఆరోగ్యానికి ఉపయోగించబడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి గ్లూకోసమైన్ యొక్క కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం:

గ్లూకోసమైన్ ప్రయోజనాలు:
1. కీళ్లు మరియు మోకాళ్ల నొప్పులు తగ్గించి అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది:
గ్లూకోసమైన్ అనేది ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్), కీళ్ల కదలికలో కష్టంగా (రుమాటిక్ ఆర్థరైటిస్) మరియు ఇతర రకాల కీళ్లు అండ్ మోకాళ్ల నొప్పి ఉన్నవారిలో నొప్పిని తగ్గించి, అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

2. కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది: 
గ్లూకోసమైన్ అనేది కీళ్ల మరియు మోకాళ్ల నొప్పి ఉన్నవారు సులభంగా కదలడానికి సహాయపడుతుంది. తక్కువ కష్టంతో రోజువారీ పనులను చేసుకోవడానికి కీళ్ల పని తీరును, వాటి చలనాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

3. మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: 
గ్లూకోసమైన్ అనేది కీళ్లలో ఎముకల మధ్య మెత్తని పదార్థం లాగా పనిచేస్తుంది. ఇది మృదులాస్థి యొక్క కీలక భాగం. గ్లూకోసమైన్ కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల మృదులాస్థి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు అరుగుదలను నెమ్మదిపరుస్తుంది.

4. కణజాలాన్ని బాగు చేయడంలో తోడ్పడుతుంది: 
గ్లూకోసమైన్ అనేది కొత్త కీళ్ల కణజాల పెరుగుదలకు తోడ్పడడంలో సహాయపడుతుంది. కీళ్లు మరియు మోకాళ్ల యొక్క పూర్తి ఆరోగ్యాన్ని
మెరుగుపరుస్తుంది.

5. మంటను తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలు: 
గ్లూకోసమైన్ మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ముసలితనపు కీళ్ల వ్యాధికి, కీళ్ల కదలికలో కష్టంగా ఉన్న వారిలో మంటను తగ్గిస్తుంది.

అదే విధంగా మిథైల్ సల్ఫోనిల్ మీథేన్ (ఎంఎస్ఎం) అనేది కొన్ని ఆహారాలలో ఉండే సహజసిద్దమైన పదార్థం. ఇది అన్ని రకాల కీళ్ల మరియు మోకాళ్ల నొప్పులకు మంచి ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఎంఎస్ఎం అనేది కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడే మంటను తగ్గించగలిగే లక్షణాలను కలిగివుంది. ఇది ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్న వారిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News