RCB VS KKR Dream11 Prediction Today Match: ఐపీఎల్ సీజన్‌లోని 36వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రస్తుతం బెంగళూరు పోటపోటిగా ఆడుతూ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అయితే కోల్‌కతా ఇప్పటికీ ఏడు మ్యాచ్‌లు ఆడగా అందులో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి ఐదు మ్యాచ్‌లు ఓటమి పాలయ్యింది. ఇక బెంగళూరు విషయానికొస్తే.. ఈ టీమ్‌ కూడా వరసగా ఏడు మ్యాచ్‌లు ఆడింది. వీటిల్లో 4 విక్టరీ సాధించి మూడు నష్టపోయింది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో నితీష్ రానా అద్భుతమైన ప్రదర్శన చూపుతున్నాడు.. ఇదే క్రమంలో నైట్ రైడర్స్‌పై తమ విజయాల జోరును కొనసాగించాలని చూస్తున్నాడు. నేడు ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ రెండు జట్లలో ఏది డ్రీమ్‌ 11 టీమ్‌, ఈ రోజు ఏ టీమ్‌ గట్టి పోటీని ఇచ్చి విజయం సాధించబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్:
నేడు ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు దిగనున్నాయి. ఈ సీజన్‌లో రెండో-చివరి మ్యాచ్‌ కాగా.. పిచ్‌కి సంబంధించిన రిపోర్ట్‌లు ఇలా ఉన్నాయి..ఈ వేదికపై గత టీ20 మ్యాచ్‌ల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 194 పరుగులు.


RCB vs KKR డ్రీమ్‌ 11 టీమ్‌:


కీపర్: దినేష్ కార్తీక్
బ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, జాసన్ రాయ్ (సి)
ఆల్ రౌండర్లు:  గ్లెన్ మాక్స్‌వెల్, ఆండ్రీ రస్సెల్, వనిందు హసరంగా
బౌలర్లు: హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ (విసి), వరుణ్ చక్రవర్తి, డేవిడ్ విల్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ 11:
విరాట్ కోహ్లీ, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, ఎస్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్ కుమార్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్.


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో


కోల్‌కతా నైట్ రైడర్స్ డ్రీమ్‌ 11 టీమ్‌ : 
ఎన్ జగదీషన్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, జాసన్ రాయ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, డేవిడ్ వైస్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ.


హెడ్ టు హెడ్(RCB vs KKR Head to Head):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ స్వల్ప ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు వారు ఆడిన 31 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించింది. మిగతా 14 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పటిష్టం చేసేందుకు రెండు టీమ్‌లు బరిలోకి దిగనున్నాయి.  


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook