RCB Gave Greatest Player Yuvendra Chahal to Rajasthan Royals says Kevin Pietersen: రాజస్థాన్‌ రాయల్స్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) చరిత్రలోనే గొప్ప బహుమతి ఇచ్చింది అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్‌గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్న యుజ్వేంద్ర చహల్‌ను ఆర్‌సీబీ ఎందుకు వదిలేసుకుందో అర్థం కాలేదని కేపీ పేర్కొన్నాడు. ఆర్‌సీబీకి విలువైన ఆస్తిగా ఉండే అతడిని వదులుకోవడం చాలా బాధాకరం అని పీటర్సన్ చెప్ప్పుకొచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు డ్వేన్‌ బ్రావో ఉన్నాడు. ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం రాజస్థాన్‌ రాయల్స్‌ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కే ఉంది. ఎందుకంటే ఇప్పటికే బ్రావో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బ్రావో 161 మ్యాచుల్లో 183 వికెట్లు తీశాడు. ఇపటివరకు చహల్‌ 137 మ్యాచుల్లో 177 వికెట్లు పడగొట్టాడు. మరో 7 తీస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ నిలుస్తాడు. ఐపీఎల్‌ 2023లో 11 వికెట్లు తీసిన యూజీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


ఐపీఎల్ 2023కి ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రాంచైజీ యుజ్వేంద్ర చహల్‌ను వదులుకొంది. మినీ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌కు బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో గొప్ప బహుమతి ఇచ్చిందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్ పేర్కొన్నాడు. బుధవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం చహల్‌ ఒక్క వికెట్‌ తీయలేదు. అంతేకాదు నాలుగు ఓవర్ల కోటాలో 41 పరుగులు ఇచ్చాడు.


'ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్ జట్టుకు అతిపెద్ద గిఫ్ట్‌ యుజ్వేంద్ర చహల్‌. అసలు చహల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎందుకు వదులుకుందో ఇప్పటికీ అర్థం కాలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు తీయగల సమర్థుడు యూజీ. అతడు ఏ జట్టులో ఉంటే వారికి అదనపు బలం. ప్రస్తుతం రాజస్థాన్ జెర్సీ వేసుకున్నాడు. గతంలో బెంగళూరుకి విలువైన ఆస్తిగా ఉన్నాడు. అలాంటి చహల్‌ను వదులుకోవడం బాధాకరం' అని కెవిన్‌ పీటర్సన్ పేర్కొన్నాడు. 


Also Read: PBKS VS RCB: బెంగళూరుదే బ్యాటింగ్.. రెండు జట్లకు కొత్త కెప్టెన్లు! తుది జట్లు ఇవే


Also Read: KL Rahul Interview: నా కెప్టెన్సీ వారికి నచ్చలేదేమో.. అందుకే బంతితో కొట్టారు: కేఎల్ రాహుల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.