PBKS VS RCB IPL 2023 Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా మరికొద్దిసేపట్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు జరుగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో ఇరు జట్లకు కొత్త కెప్టెన్లు ఉన్నారు. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తుది జట్టులో ఉన్నా.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ సారధ్య బాధ్యతలు అందుకున్నాడు. మరోవైపు పంజాబ్ సారథి శిఖర్ ధావన్ గాయంతో ఈ మ్యాచ్ ఆడడం లేదు.
16వ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దాంతో బెంగళూరుకి ఈ మ్యాచ్ కీలకం కానుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచులో మాత్రం బెంగళూరు ఫేవరేట్ జట్టుగా ఉంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
తుది జట్లు:
పంజాబ్: అథర్వ తైడే, మ్యాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్ (కెప్టెన్), జితేశ్ శర్మ (కీపర్), షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లామ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షహ్‌బాజ్ అహ్మద్, వహిందు హసరంగ, సుయాశ్ ప్రభుదేశాయ్, హర్షల్ పటేల్, వ్యాన్ పార్నెల్, మొహ్మద్ సిరాజ్.
🚨 Toss Update 🚨@PunjabKingsIPL win the toss and elect to field first against @RCBTweets.@CurranSM & @imVkohli are leading their respective sides today.
Follow the match ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/ITFDTd7ObP
— IndianPremierLeague (@IPL) April 20, 2023
సబ్‌స్టిట్యూట్‌లు:
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, సికిందర్ రజా, మోహిత్ రాతీ, రిషి ధావన్, శివమ్ సింగ్.
బెంగళూరు: వైశాక్ విజయ్ కుమార్, డేవిడ్ విల్లే, ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్.
Also Read: KL Rahul Interview: నా కెప్టెన్సీ వారికి నచ్చలేదేమో.. అందుకే బంతితో కొట్టారు: కేఎల్ రాహుల్
Also Read: DC vs KKR Dream11 Team: ఢిల్లీ vs కోల్‌కతా డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.