RR vs CSK Dream11 Prediction Today Match and Dream11 Team: ఐపీఎల్‌లోని 37వ మ్యాచ్‌ గురువారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) తలపడనున్నాయి. ఈ సీజన్‌లో రాజస్థాన్ ఏడు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి మూడో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 190 పరుగుల తీసి ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో  కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అత్యధిక స్కోరు చేసిన తర్వాత రాజస్థాన్‌పై ఈ రోజు తలపడనున్నారు. గత మ్యాచ్‌లతో డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో రెండు బలంగా ఉండడం వల్ల మ్యాచ్‌ రసవత్తరంగా కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన డ్రీమ్‌ 11 టీమ్‌ ఏంటి? ఏ టీమ్‌ ఎక్కువ స్కోర్‌ చేస్తుంది?, స్టేడియం పీచ్‌ రిపోర్ట్‌ వివరాలేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


డ్రీమ్‌ 11 ప్లేయింగ్:
చెన్నై సూపర్ కింగ్స్:

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే , అంబటి రాయుడు , అజింక్యా రహానే , మోయిన్ అలీ , జడేజా,  దుబే, ఎమ్‌ ఎస్‌  ధోని(C) , టీయు దేశ్ పాండే, మతీషా పతిరనా, మహేశ్ తీక్షణ


రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్ , రవిచంద్రన్ అశ్విన్ , జాసన్ హోల్డర్ , జోస్ బట్లర్ , ఎస్‌వీ శాంసన్ (C), ధృవ్ జురెల్ , ట్రెంట్ బౌల్ట్ , యుజ్వేంద్ర చాహల్ , సందీప్ శర్మ


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి


పిచ్ రిపోర్ట్:
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఈ సీజన్‌లో రెండవ మ్యాచ్‌. ఇదే పీచ్‌లో రాయల్స్ 155 పరుగుల తీసింది. అయితే ఈ స్టేడియంలో టీమ్‌లు తక్కువ స్కోర్‌ చేసినప్పటికీ గేమ్‌ మాత్రం అసక్తిగా కొనసాగుతుంది. ఈ స్టేడియంలో గత ఐదు టీ20 మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ స్కోరు 126 పరుగులు తీశారు. 


డ్రీమ్‌ 11 టీమ్‌:
కీపర్స్‌: డెవాన్ కాన్వే, జోస్ బట్లర్, సంజు శాంసన్
బ్యాట్స్‌మెన్: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ (విసి)
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా (సి), రవిచంద్రన్ అశ్విన్
బౌలర్లు: యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, తుషార్ దేశ్‌పాండే.


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook