RR vs CSK IPL 2023 37th Match Live Score Updates: మరికాసేపట్లో జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో చెన్నై ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచులో స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆడడం లేదని రాజస్థాన్ సారథి సంజూ తెలిపాడు. అతడి స్థానంలో ఆడమ్ జంపా తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 15 సార్లు విజయం సాధించగా.. రాజస్థాన్‌ 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. నేటి మ్యాచ్‌ జైపుర్‌లోని సవాయ్‌మాన్‌ సింగ్ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియంలో రాజస్థాన్‌, చెన్నై ఏడు మ్యాచ్‌లు ఆడగా.. సంజూ సేన నాలుగుసార్లు విజయం సాధించగా.. చెన్నై 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక రాజస్థాన్‌ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. చెన్నై 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. 



తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్‌), షిమ్రాన్ హెట్‌మయర్‌, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎం ఎస్ ధోనీ (కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్. 


Also Read: BCCI Contract: మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ.. జెమీమా, షఫాలీకి నిరాశే!  


Also Read: Telangana Covid 19 Cases: మళ్లీ విజృభింస్తోన్న కరోనా వైరస్.. తెలంగాణాలో కొత్తగా ఎన్ని కేసులంటే?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.