Royal Challengers Bangalore beat Rajasthan Royals in IPL 2023 60th Match: ఐపీఎల్‌ 2023లో భాగంగా ఆదివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 59 పరుగులకే ఆలౌటైంది. దాంతో 112 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. వేన్ పార్నెల్ మూడు వికెట్లతో చెలరేగాడు. షిమ్రాన్ హెట్మెయర్ (35) టాప్ స్కోరర్. సొంత మైదానంలో రాజస్తాన్‌ను మట్టికరిపించిన బెంగళూరు.. రన్‌రేట్ భారీగా పెంచుకుని ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

172 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు తొలి ఓవర్‌ నుంచే వరుస షాక్‌లు తగిలాయి. మొహ్మద్ సిరాజ్‌ వేసిన మొదటి ఓవర్‌లో యశస్వి జైస్వాల్ (0) విరాట్ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చాడు. వేన్ పార్నెల్‌ వేసిన రెండో ఓవర్‌లో జోస్ బట్లర్ (0) సిరాజ్‌కు చిక్కాడు. సంజు శాంసన్ (4) వికెట్ కీపర్‌ అనుజ్‌ రావత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మైఖేల్ బ్రాస్‌వెల్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి దేవదత్‌ పడిక్కల్‌ (4) క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. జో రూట్‌ (10) పార్నెల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో రాజస్థాన్ 28 పరుగులకే ఐదు వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


ఇక ధ్రువ్ జురెల్ (1) బ్రాస్‌వెల్ వేసిన ఏడో ఓవర్లో చివరి బంతికి మహిపాల్ లామ్రోర్‌కు చిక్కాడు. కర్ణ్‌ శర్మ వేసిన ఎనిమిదో ఓవర్‌లో శిమ్రాన్ హెట్‌మయర్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదగా.. చివరి బంతికి ఆర్ అశ్విన్‌ (0) రనౌట్‌ అయ్యాడు. దూకుడుగా ఆడుతున్న హెట్‌మయర్‌ కూడా గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన 9.5 బంతికి బ్రాస్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక కర్ణ్‌ వేసిన 11 ఓవర్లో ఆడమ్‌ జంపా (2) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కేఎం ఆసిఫ్‌ (0) విరాట్ కోహ్లీకి క్యాచ్‌ ఇవ్వడంతో రాజస్థాన్‌ ఆలౌటైంది.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 171 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (55; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. ఇన్నింగ్స్ చివర్లో అనుజ్‌ రావత్ (29 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లీ (18), మహిపాల్ లామ్రోర్ (1), దినేశ్ కార్తిక్‌ (0) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఆసిఫ్‌, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టారు. 


Also Read: Cheteshwar Pujara Vice Captain: టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఛతేశ్వర్‌ పుజారా!  


Also Read: Tata Nexon Facelift: మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్స్ లీక్!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.