Shikhar Dhawan IPL Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సమం చేసిన శిఖర్ ధావన్!
PBKS vs KKR, Shikhar Dhawan levels Virat Kohli IPL record. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు.
PBKS vs KKR, Shikhar Dhawan levels Virat Kohli IPL record: టీమిండియా సీనియర్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధికసార్లు 50 ప్లస్ భాగస్వామ్యాలు సాధించిన క్రికెటర్‌గా గబ్బర్ నిలిచాడు. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో ధావన్‌కు ఇది 94వ అర్థశతక భాగస్వామ్యం. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆర్‌సీబీ తరపున విరాట్ 94 అర్థశతక భాగస్వామ్యాలు అందించాడు.
ఐపీఎల్‌లో అత్యధికసార్లు 50 ప్లస్ భాగస్వామ్యాలు సాధించిన క్రికెటర్‌గా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (94) ఉన్నాడు. 94 అర్థశతక భాగస్వామ్యాలతో శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా (83 అర్థశతక భాగస్వామ్యాలు) మూడో స్థానములో ఉండగా.. ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (82) నాలుగో స్థానంలో ఉన్నాడు. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో భానుక రాజపక్సతో కలిసి ధావన్ 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఎడమచేతి వాటం ఓపెనర్ 29 బంతుల్లో 137.93 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేశాడు.ధావన్ ఇన్నింగ్స్‌లో ఆరు బౌండరీలు ఉన్నాయి.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భానుక రాజపక్సే (50) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శిఖర్ ధావన్ (40) కీలక పరుగులు చేశాడు. ప్రభసిమ్రాన్ సింగ్ (23), జితేశ్ శర్మ(21), సికిందర్ రజా (16) రాణించారు. ఇన్నింగ్స్ చివరలో ఆల్‌రౌండర్ సామ్ కరన్ (26), షారుఖ్ ఖాన్ (11) వేగంగా ఆడారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ రెండో వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం కోల్‌కతా లక్ష్యాన్ని చెడిస్తోంది.
Also Read: Balakrishna Kohli Dialogue: అమ్మో విరాట్ కోహ్లీనా.. ఫైర్ బ్రాండ్! నందమూరి బాలకృష్ణ నోట ఫన్నీ డైలాగ్
Also Read: Best SUV under 10 Lakh: 10 లక్షలలోపు 5 సూపర్ ఎస్‌యూవీలు.. బెస్ట్ మైలేజ్, సూపర్ లుకింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.