SRH vs LSG IPL 2023 Live Score Updates: ఐపీఎల్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఉప్పల్‌ వేదికగా మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఐడెన్ మార్‌క్రమ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. హైదరాబాద్‌ జట్టులోకి యువ ఆల్‌రౌండర్‌ సన్వీర్‌ సింగ్‌ వచ్చాడు. లక్నో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. దీపక్‌ హుడా, మోషిన్‌ల స్థానంలో ప్రేరక్‌, యుధ్‌వీర్‌లకు తుది జట్టులోకి వచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సొంత మైదానంలో లక్నోతో తలపడనుంది. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో ఓడింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.


తుది జట్లు:
సన్‌రైజర్స్‌: ఎయిడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, గ్లెన్‌ ఫిలిప్స్‌, అబ్దుల్‌ సమద్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, మయాంక్‌ మార్కండే, భువనేశ్వర్‌ కుమార్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, టి నటరాజన్‌. 
లక్నో సూపర్‌ జెయింట్స్‌: క్వింటన్‌ డికాక్‌, కృనాల్‌ పాండ్యా (కెప్టెన్), కైల్‌ మేయర్స్‌, ప్రేరక్‌ మన్కడ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, నికోలస్‌ పూరన్‌, యశ్‌ ఠాకూర్‌, యుద్ధ్‌వీర్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌. 


ఇంపాక్ట్ ప్లేయర్లు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వివ్రాంత్ శర్మ, సన్విర్‌ సింగ్, మయాంక్‌ దగర్, నితీశ్ కుమార్‌ రెడ్డి, మార్కో జాన్‌సెన్.  
లక్నో సూపర్‌ జెయింట్స్‌: స్వప్నిల్ సింగ్, డానియల్ సామ్స్, ఆయుష్ బదోని, దీపక్‌ హుడా, అర్పిత్ గులేరియా. 


Also Raed: Suryakumar Yadav Century: పెళ్లాం ఉంటే కొట్టలేమన్నారు.. ఇప్పుడేమంటారు చెప్పండి! సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు  


Also Read: Keerthy Suresh Photos: అప్పుడే ఏడాది అంటూ ఆ హాట్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.