Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు
Suryakumar Yadav Perfomance in IPL 2023: టీ20లు అంటేనే పూనకవచ్చినట్లు ఊగిపోయే సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమవుతుండడంతో ముంబై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Suryakumar Yadav Perfomance in IPL 2023: ఎంతటి బ్యాట్స్‌మెన్‌కు అయినా కొంతకాలం గడ్డుకాలం నడుస్తుంది. అలవోకగా సెంచరీలు బాదిన స్టార్ అయినా.. ఫామ్ కోల్పోతే ఒక్కోసారి చెత్త బాల్స్‌కు కూడా వికెట్ సమర్పించుకుంటాడు. ప్రస్తుతం టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంకర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా అదే పరిస్థితి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముందు వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్.. ఆ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అది వన్డే ఫార్మాట్.. తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్ ఐపీఎల్‌లో మళ్లీ పుంజుకుంటాడని అభిమానులు అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా చెత్త ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గత 6 ఇన్నింగ్స్‌ల్లో సూర్య నాలుగు సార్లు సున్నాకే ఔటయ్యాడు. అయితే సూర్య తిరిగి పుంజుకునేందుకు 10 బంతులు చాలని అంటున్నాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ పీయూష్ చావ్లా. సూర్య ఎలాంటి బ్యాట్స్‌మెనో మనందరికీ తెలుసు అని.. కచ్చితంగా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడని అన్నాడు.
ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒక పరుగుకే ఔట్ అవ్వగా.. ఢిల్లీతో మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేదు. తిలక్ వర్మ ఔట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్య.. కూల్‌గా బ్యాటింగ్ చేసిన సరిపోయేది. అవతలి ఎండ్‌లో రోహిత్ శర్మతో కలిసి జట్టును ఈజీగా గెలిపించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. వచ్చి రాకతోనే భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద కుల్దీప్ యాదవ్‌కు దొరికిపోయాడు.
Also Read: DC Vs MI Highlights: హైఓల్టెజ్ మ్యాచ్.. ముంబై ఇండియన్స్ విక్టరీ.. ఢిల్లీకి నాలుగో ఓటమి
గతేడాది సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్‌లో దుమ్ములేపాడు. 31 ఇన్నింగ్స్‌లలో 46.56 సగటుతో.. 187.43 స్ట్రైక్ రేట్‌తో 1,164 రన్స్ చేశాడు. ఇందులో 9 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. 2022లో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.
Also Read: Fastest 50 in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన టాప్-5 ప్లేయర్లు వీళ్లే..
Also Read: Karnataka Elections: రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ఎన్నికల్లో మాజీ సీఎం విచిత్ర హామీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి